రంగారెడ్డి

మన తెలంగాణ మన కూరగాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, ఏప్రిల్ 22: మండలంలోని ప్రతి గ్రామంలో మన తెలంగాణ-మన ఊరు-మన కూరగాయల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గండిపేట మండలంలోని మణికొండ, పీరం చెరువు గ్రామాలలో మన తెలంగాణ-మన కూరగాయల కేంద్రాలను ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాలల్లో మన తెలంగాణ- మన కూరగాయాలను కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులను సూచించారు. కేంద్రాలలో తాజా కూరగాయలు, తక్కువ రేటుకు ప్రజలకు అందించవచ్చని పేర్కొన్నారు. మండల పరిధిలోని రెండు మూడు ఎకరాల స్థలం మార్కెటింగ్ శాఖ అధికారులకు చూపెడితే, ఈ ప్రాంతంలో కూరగాయాల మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వట్టినాగులపల్లి విప్రో బాధితలకు స్థలాలను కూడా కేటాయించేందుకు ప్రభుత్వం త్వరలో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఏర్పాటు చేస్తున్నట్లు అన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కొండ విశే్వశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంపీపీ తలారి మల్లేష్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఖానాపూర్ సర్పంచ్ రామేశ్వర్ నర్సింహా, మణికొండ సర్పంచ్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతగిరి కిటకిట
*తరలి వచ్చిన భక్తులు
వికారాబాద్, ఏప్రిల్ 22: వేసవి సెలవులు, ఆదివారం సెలవు రోజు కావడంతో అనంతగిరి శ్రీఅనంత పద్మనాభస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన భక్తులు.. స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి ఎండలు తీవ్రంగా ఉండటంతో అనంతగిరి అడవి చల్లటి వాతావరణంలో సేద తీరేందుకు పొరుగు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు అనంతగిరికి వచ్చారు.