రంగారెడ్డి

కనీస వౌలిక వసతులు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, ఏప్రిల్ 24: ప్రజలు కనీస వౌలిక వసతులులేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే తగిన చోరవ తీసుకొని వౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షు డు, ఎల్బీనగర్ టీడీపీ కన్వీనర్ సా మ రంగారెడ్డి కోరారు. మంగళవారం చైతన్యపురి, కొత్తపేట్ డివిజన్లల్లో స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ.. ఎల్బీనగర్ సర్కిల్-3 డిప్యూ టీ కమిషనర్‌కు సామ రంగారెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి వినతి పత్రం అందజేశారు. సామ మాట్లాడుతూ.. టీడీపీ ఇంటింటికీ పాదయాత్రలో భాగంగా కొత్తపేట్ డివిజన్‌లో పర్యాటించినప్పుడు, స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటి జనాభాకు అనుగుణంగా నూతన భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ వేయాలని కోరారు. కొత్తపేట్, చైతన్యపురి డివిజన్లల్లో సూచించిన పలు సమస్యలను అధికారులు నోట్ చేసు కోని వెంటనే పనులు మొదలు పెట్టాలని సామ కోరారు. ప్రసాద్ బాబాయ్, రామేశ్వర్, రవిశంకర్, కృష్ణారెడ్డి, మెట్టు సంజీవ రెడ్డి, క్రిష్ణవేణి పాల్గొన్నారు.
పేదలకు వరం.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్
షాద్‌నగర్, ఏప్రిల్ 24: బడుగు బలహీన వర్గాల ప్రజలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఒక వరం లాంటివని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. రూ. 51వేల నుంచి రూ.100116వరకు పెంచారని గుర్తు చేశారు. ఎనిమిది మంది లబ్ధిదారులకు 5.52లక్షల చెక్కులు, షాదీముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న 14మంది లబ్ధిదారులకు రూ. 9.79లక్షల చెక్కులను పంపిణీ చేశారు. నందిగామ మండలానికి చెందిన బొమ్మగల్ల అమృత, గడ్డమీది యాదమ్మకు రూ.75116 చొప్పున కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫరూఖ్‌నగర్ తహశీల్దార్ రామారావు, టీఆర్‌ఎస్ నాయకులు కొందూటి పాల్గొన్నారు.