రంగారెడ్డి

రైతాంగాన్ని విస్మరిస్తున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఏప్రిల్ 24: రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమోందర్ రెడ్డి అన్నారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణ సమీపంలోని వివేకానంద ఇంజనీరింగ్ కళాశాలలో భారతీయ జనతా పార్టీ కిసాన్‌మోర్చా రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ప్రేమోందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం అనేక విధాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆరోపించారు. 2014లో రైతులు ఏ స్థాయిలో ఉన్నారో.. ప్రస్తుతం అదే స్థాయిలో ఉన్నారే తప్ప వారిలో ఎలాంటి మార్పులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకురాలేదని వాపోయారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిగా రైతు శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించడంలో అంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వారి గొంతులను నొక్కడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందే తప్పా ప్రజా సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రైతులు లాభాలు పొందుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలోనే రైతులు వెనకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా 60శాతం ఉంటుందని గుర్తు చేశారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ఇండ్లకు గాను ఒక్కొక్క ఇంటికీ రూ.1.50లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిందని వివరించారు. బయోగ్యాస్ లేని వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో 20లక్షలకుపైగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్దన్ రెడ్డి, కిసాన్‌మోర్చా నాయకులు బాల్‌రెడ్డి, పాపన్న గౌడ్, నర్సింహా రెడ్డి, శివారెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్నారు.

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
బొంరాస్‌పేట, ఏప్రిల్ 24: మత్తు పదార్థాలకు యువత బానిసలై చేస్తున్న తప్పులను గుర్తించలేక పోతున్నారని, నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు అధికంగా చోటు చేసుకుంటున్నట్లు కొడంగల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి రామ్మోహన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన వేదికలో పాల్గొని చట్టాల గురించి అవగాహన కల్పించారు. న్యాయస్థానాలకు వస్తున్న కేసులను పరిశీలిస్తే చాలామంది మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని, మత్తులో చేసిన తప్పులకు జీవితాంతం బాధ పడటమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా వీధినపడేసిన పాపాన్ని మూటకట్టుకుంటున్నారని అన్నారు. ఆదర్శంగా ఉండాల్సిన యువత మత్తుకు బానిసలై పెడదోవన పయనించడం దేశానికి మంచిది కాదని, తాము చేస్తున్న తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత యువతదేనని సూచించారు. గతంలో శిక్షల స్థాయి తక్కువగా ఉండేదని, నేడు చట్టాలకు పదును పెట్టడంతో జీవిత ఖైదు విధించిన కేసులకు నేడు మరణశిక్షలు విధిస్తున్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. నేరాలకు దూరంగా ఉండి తద్వారా వ్యక్తిగత గౌరవంతోపాటు సమాజంలో, కుటుంబంలో కూడా గౌరవం పొందగలుగుతారని అన్నారు. భూ సమస్యల విషయంలో మండల స్థాయిలో న్యాయం జరగకుంటే ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని, చిన్నచిన్న విషయాలకు కోర్టుల్లో కేసులు వేయడంతో అన్ని రకాలుగా ఇబ్బందుల పాలవుతారని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, బార్ కౌన్సిల్ సభ్యులు సుధాకర్ రెడ్డి, భువనప్ప, బస్వరాజ్ పాల్గొన్నారు.