రంగారెడ్డి

సకల జనుల భాగస్వామ్యంతోనే తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధారూర్, ఏప్రిల్ 24: సకల జనుల భాగస్వామ్యంతోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం గ్రామ స్వరాజ్ అభియాన్ పథకంలో భాగంగా పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా వికారాబాద్‌లోని అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. నాలుగు దశాబ్దాలుగా గాంధీజీ కలలు గ్రామ స్వరాజ్యం అమలు కాలేదని గ్రహించిన కేసీఆర్.. రాష్ట్రంలో కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయడమే కాకుండా కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని గత నెల 18న అమలులోకి తెచ్చారని అన్నారు. రాష్ట్రంలో 8690 గ్రామ పంచాయతీలు ఉండగా 4384 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో 367 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా 209 గ్రామాలను పంచాయతీలుగా మార్చామని తెలిపారు. గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద ఎంపికైన ఉత్తమ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీల్లో ప్రథమ పంచాయతీగా గోధుమగూడ గ్రామం ఎంపికయిందని, ప్రోత్సాహకంగా రూ.10లక్షల చెక్కును సర్పంచ్ స్వరూపకు అందించారు. ద్వితీయ బహుమతి యాలాల్ మండల్ రాఘపూర్‌గా రూ.7.5లక్షలు, తృతీయ బహుమతి దోమ మండలం రూ.5 లక్షల చెక్కును అందజేశారు. మంత్రి మహేందర్ రెడ్డి, కలెక్టర్ ఉమర్ జలీల్, డీపీవో జమీల్, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవ రావు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్ పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ ప్లీనరీలో సంక్షేమ కార్యక్రమాలపై చర్చ
ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం వికారాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటి వరకు 30 సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. వౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని తెలిపారు. దేశంలో గుణాత్మక రాజకీయ కూటమి ఏర్పాటు కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గం నంచి 100 మంది చొప్పున ప్లీనరీకి రాష్టవ్య్రాప్తంగా 12వేల మంది హాజరుకానున్నట్లు ప్రకటించారు. హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాను చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మెన్ కొండల్ రెడ్డి, రాష్ట్ర వౌలిక వసతుల చైర్మెన్ నాగేందర్ గౌడ్, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రా రెడ్డి, జడ్పీటీసీ ముత్తహర్ షరీప్ పాల్గొన్నారు.
గ్రామస్వరాజ్ స్థాపనకు సీఎం కృషి
మోమిన్‌పేట: గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్ స్థాపనకు తెలంగాణ సిఎం కేసీఆర్.. తాగు, సాగునీరు, చదువు ఆరోగ్యం, విద్యుత్ సౌకర్యాలు అందించడంలో ముఖ్య ఉద్ధేశ్యమని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండల పరిధి కోల్కుందలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలతో మంత్రులు మహేందర్‌రెడ్డి, జూపల్లి మాట్లాడారు. కూలీలకు సకాలంలో డబ్బులు అందుతున్నాయా, పని సక్రమంగా కల్పిస్తున్నారా అని ఆరా తీసారు. అనంతరం గ్రామ స్వరాజ్ అభియాన్ దివస్ గ్రామసభను నిర్వహించారు. వచ్చే రెండేళ్లలో పాలమూర్ - రంగారెడ్డి జిల్లాలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గ్రామ స్వరాజ్, పంచాయతీ చట్టం తీసుకువచ్చినా అభివృద్ధి జరగడం లేదని అన్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు మంత్రి దృష్టికి తేగా త్వరలో కల్పిస్తామని చెప్పారు. సర్పంచ్ రాములమ్మ, ఎమ్మెల్యే సంజీవరావు, కలెక్టర్ ఉమర్ జలీల్, గ్రంథాలయ చైర్మన్ కొండల్‌రెడ్డి, పాల్గొన్నారు.