క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో సర్వే ల్యాండ్ ఏడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 30: ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ సర్వే, ల్యాండ్ ఏడీ సదాశివుడు అధికారి ఏసీబీకి పట్టుబడిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఏ.సూర్య నారాయణ తెలిపిన వివరాల ప్రకారం నవాబ్‌పేట మండలం కొజ్జవనంపల్లి (గేటు వనంపల్లి) గ్రామంలో ఆర్డీ రిటైర్‌మెంట్ ఉద్యోగులు శ్రీనివాస్ రెడ్డి, అల్లురయ్య, రాఘవేందర్ గౌడ్‌లకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని సప్లమెంటరీ సేత్‌వార్ చేసుకునేందుకు వికారాబాద్ జిల్లా సర్వే, భూ రికార్డుల అధికారి ఎం.సదాశివుడు డబ్బులు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిని రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఈ నెల ఏప్రిల్ 25న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఐదు రోజులుగా విచారణ చేసిన అధికారులు సోమవారం బుర్గుపల్లిలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని సర్వే, భూ రికార్డుల కార్యాలయానికి వెళ్లిన శ్రీనివాస్ రెడ్డి రూ.60 వేలు లంచం సదాశివుడికి ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. మంగళవారం సర్వే, ల్యాండ్ ఏడీ అధికారిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు. ఇతను మరో రెండు నెలల్లో రిటైర్డ్ కానున్నారు. ముగ్గురు ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగుల వద్ద గతంలో కొంత డబ్బు లంచం కింద తీసుకున్నట్లు తెలిసింది. వికారాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా అధికారి ఏసీబీకి పట్టుబడిన కేసు రెండవది కాగా, గతంలో యాలాల్ మండలంలో ఏసీబీకి కానిస్టేబుల్ పట్టుబడ్డాడు.
లంచం తీసుకుంటే జైలుకే
రాత పూర్వకంగా ఫిర్యాదు అందజేస్తే ఎవరిని ఉపక్రమించేది లేదని, లంచం తీసుకుంటూ పట్టుబడితే జైలుకు పంపుతామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు. ఏసీబీకి ఫిర్యాదు చేయదలుచుకున్నవారు 9440446140 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. సర్వే, ల్యాండ్ అధికారిపై ఏసీబీ చేసిన దాడిలో సీఐలు బీ.గంగాధర్, సీ.లక్ష్మి, ఎస్.నవీన్, ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.