రంగారెడ్డి

పట్టపగలు ఓయూ ఉద్యోగి ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్: బోడుప్పల్ అంబేద్కర్‌నగర్ చౌరస్తాలో ఆదివారం పగలు ఓ వ్యక్తి ప్రజలు చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలుతున్న అతన్ని అక్కడే నిరాహార దీక్షలో కూర్చున్న కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య సభ్యులు మంటలను ఆర్పి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడుప్పల్ బయన్నగూడ గణేష్‌నగర్‌లో నివసిస్తున్న నల్గొండ జిల్లా కోదాడ మండలం బాలాజీనగర్‌కు చెందిన చందులాల్‌నాయక్ (45) ఉస్మానియా యూనివర్సిటీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. భార్య, హైమావతి, ముగ్గురు పిల్లలు ఉన్న అతడు ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం చౌరస్తాకు వచ్చాడు. ఇదే ప్రాంతంలోని అంబేద్కర్‌నగర్ విగ్రహం వద్ద నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష వద్ద కొద్దిసేపు నిల్చొన్నాడు. పక్కనే ఉన్న బేకరీ వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న బాటిల్‌లో ఉన్న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
మంటల్లో కాలుతున్న అతన్ని చూసి దీక్షలో ఉన్న సమాఖ్య ప్రతినిధులు కూర్చున్న దుప్పటితో మంటలను ఆర్పి 108కు సమాచారం ఇచ్చారు. అప్పటికే సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న చందులాల్‌నాయక్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎందుకు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డావని అడిగితే తెలంగాణ వచ్చిందా అయితే మంచినీళ్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎప్పుడు ఇస్తారు? అని అడిగినట్టు తెలిసింది. కాగా కుటుంబ గొడవల వల్లే అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు అంటున్నారు. ఘటనకు కారణాలు విచారణలో తెలియాల్సి ఉందని ఎస్‌ఐ వెంకటయ్య తెలిపారు. కుమారుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
కీసర: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర రజక సంఘం జెఎసి చైర్మన్ పంజగారి ఆంజనేయులు డిమాండ్ చేసారు. ఆదివారం కీసరగుట్టలో రజకసంఘం రాష్ట్ర జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. న్యాయ పరమైన హక్కుల కోసం రజకులు ఏకం కావాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రజకులు అక్షరాస్యత లేని కారణంగా అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రజకులను బిసి జాబితా నుంచి తొలగించి ఎస్సీ జాబితాలోకి చేర్చాలని కోరారు. రాజకీయంగా, ఆర్ధికంగా రజకులు ఎదగాలంటే పోరాటాలు చేయాలని చెప్పారు. రజకులు నేటికి కుల వృత్తులు నమ్ముకుని జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పధకాలలో రజకులకు ప్రత్యేక రాయిలీ కల్పించాలని డిమాండ్ చేశారు.