రంగారెడ్డి

పన్నుల వసూలులో అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన సభ్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, డిసెంబర్ 1: పన్నులు వసూలు చేయటంలో అధికారులు విఫలం కావటంతోనే పంచాయతీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని మండల సభలో సభ్యులు, సర్పంచ్‌లు మూకుమ్మడిగా అధికారులపై విరుచుకు పడటంతో సభలో గందరగోళం జరిగింది. ఘట్‌కేసర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మండల పరిషత్ సమావేశం హాల్‌లో ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఘట్‌కేసర్ మండలంలో ఇంజనీరింగ్ కళాశాలలు అధికంగా ఉన్నాయని, ఒక్క కళాశాల.. పంచాయతీకి పన్నులు కట్టడం లేదని, దీంతో పాలన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మండల సర్పంచ్‌లు ఆరోపించారు. పన్నుల వసూలులో సంబందిత అధికారులకు పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కనీసం నోటీసులు ఇవ్వడం లేదని ఆరోపించారు. యంనంపేట్ గ్రామంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల.. పంచాయతీకి రెండున్నర కోట్లు బకాయిలు ఉందని, ఇప్పటి వరకు అధికారులు ఏమి చేస్తున్నారని సభ్యుడు నర్రి శ్రీశైలం ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకంతో పంచాయతీలకు నిధులు రావటం లేదని, పంచాయితీ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వటానికి డబ్బులు లేవని చెప్పారు. పంచాయతీల పరిధిలో రావలసిన బకాయిల వసూలుకు అధికారులు వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘట్‌కేసర్ పంచాయతీ పరిధిలో ఉన్న వాణిజ్య సముదాయాలకు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న అద్దే మాత్రమే చెల్లిస్తున్నారని, దీంతో నెలకు లక్ష రూపాయల చొప్పున పంచాయతీకి గండి పడుతుందని సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆరోపించారు.
గ్రామ పంచాయతీ మడిగెలకు వేలం వేసి కొత్తవారికి కేటాయించేలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమలు చేయటం లేదని నిలదీశారు. కొంత మంది నాయకులు, ప్రజా ప్రతినిధులు కావాలని మడిగెల వేలం పాటను నిలుపుదల చేశారని, అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అచారు. ఘట్‌కేసర్ పంచాయతీకి దీర్ఘకాలిక కార్యదర్శిని నియమించే వరకు మండల సభలోకి అడుగు పెట్టనని, సభను బహిష్కరించి బయటకు వెళ్లారు. రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు స్థానికంగా లభించటం లేదని, హయత్‌నగర్‌కు వెళ్లి తీసుకోవాల్సి వస్తోందని, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సభ్యులు ఆరోపించారు. మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ పనిముట్లను అందుబాటులో ఉంచాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీటిసి మంద సంజీవరెడ్డి, వైస్ ఎంపిపి గ్యార లక్ష్మయ్య, మండల రైతు సేవా సహాకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామికుర్మ, మండల తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, మండల పరిషత్ విస్తరణాధికారి నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించాలి

రాజేంద్రనగర్, డిసెంబర్ 1: భారతదేశ ఆహార భద్రతకు 21 శతాబ్ధంలో అతి పెద్ద సవాల్ పర్యావరణ మార్పులు అని వాటిని నిరోధించే సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేర్చాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ సి.పార్థసారధి అన్నారు. ‘పర్యావరణ మార్పు - సవాళ్లు, పంటల తెగుళ్లు, యాజమాన్యం’ అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ పాథాలజిస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సుకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిశోధనా ప్రాధాన్యతల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే బాధ్యత శాస్ర్తియ సమాజానిదని తెలిపారు. హరిత విప్లవ ఫలితాలు చివరి దశకు చేరాయని, పంట అధిక ఉత్పాదకతకు మరో హరిత విప్లవం రావాల్సి ఉందని అన్నారు. పర్యావరణ మార్పులు, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే ప్రతి చిన్న అంశం రైతుకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కార్బన్ డయాక్సైడ్‌లతో నూతన తెగుళ్లు పంటలను ఆశించవచ్చని చెప్పారు. వాటిని సమర్థవంతంగా యాజమాన్య పద్ధతిలో బోధించాలని అన్నారు. రైతులకు లాభాలను చేకూర్చే స్థానిక అంశాలపై దృష్టి సారించాలని శాస్తవ్రేత్తలకు సూచించారు. పర్యావరణ మార్పులను కేవలం ఒక అంశంగానే కాకుండా మానవాళి ముందున్న నిజమైన సమస్యగా పరిగణించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, రైతుల ఆదాయంపై వీటి ప్రభావం స్పష్టంగా కనిపించిందని తెలిపారు.
ఆధునిక సాంకేతిక పద్ధతులకు ప్రభుత్వాలు మద్దతుగా ఉంటే రైతులను ఆదుకోగల్గుతామని పార్థసారధి వెల్లడించారు.
ఏకపంటల సాగుతో చిన్న చితక తెగుళ్లు, పురుగులు నష్టం కలిగిస్తున్నాయని అన్నారు. బయోటెక్నాలజీ, జీవ వైవిధ్యం వంటి అంశాలను ఉపయోగించుకోవాలని కోరారు. సమగ్ర జీవో వలన యాజమాన్యంతో వాతావరణ మార్పుల ప్రభావంతో ఎంత మేరకు తగ్గించుకోవచ్చని శాస్తవ్రేత్తలను కోరారు. అనంతరం సింపోజియమ్ సావనీర్‌ను విడుదల చేశారు.
కార్యక్రమంలో సింపోజియమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ విజయ్, ఇండియన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ పాథాలజిస్ట్ కార్యదర్శి డాక్టర్ రతన్, హార్టికల్చర్ కమిషనర్ ఎల్.వెంకట్‌రామిరెడ్డి, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.ప్రతాప్, డాక్టర్ చటోపాధ్యాయ, 14 రాష్ట్రాల నుంచి నిపుణులు, శాస్తవ్రేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.

పోలీసులకు కళ్లు, చెవులు సెక్యూరిటీ గార్డులే

నార్సింగి, డిసెంబర్ 1: హైదరాబాద్ నగర పోలీసులకు కళ్లు, చెవులు లాంటి వారు సెక్యూరిటీ గార్డులు అని పశ్చిమ మండల డిసిపి ఎ.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మద్యాహ్నాం ఖాజామెన్సన్ హాల్‌లో ‘ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్’’ పేరుతో ఆసీఫ్‌నగర్ పోలీస్ డివిజన్ పరిధిలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు అవగాహన సదస్సును నిర్వహించారు. డిసిపి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని నేరరహిత సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు చేస్తున్న కృషికి.. పౌరులు, వివిధ సంస్థలలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుల సహాయ సహకారాలు అవసరమని అన్నారు. పెద్ద షాపింగ్ మాల్స్, ఏటిఎం సెంటర్లు, బ్యాంక్‌లు, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్, బంగారు నగల షాపులు, దుకాణాలు, వివిధ రంగాలలోని సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారని, వారందరి సహాయ సహాకారాలు పోలీసులకు అవసరం అని పేర్కొన్నారు. నగరంలోని వివిధ సంస్ధలల్లో పనిచేసే ప్రతి సెక్యూరిటీ గార్డుల వద్ద ఆయా ప్రాంతాల పోలీస్‌స్టేషన్, ఎస్‌ఐ, ఇన్స్‌పెక్టర్, ఏసిపి, డిసిపితోపాటు నగర పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు తప్పక పెట్టుకోవాలని అన్నారు. సెక్యూరిటీ గార్డుల నెంబర్లు కూడా పోలీసులు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎదైన సంఘటన జరిగితే సులభంగా నిందితులను పట్టుకోవచ్చని తెలిపారు. అందరి నెంబర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డుల వారి సెల్‌ఫోన్‌లో ఆ సంఘటనను చిత్రికరించాలని అప్పుడు వివరాలు తొందరగా తెలుసిపోతుందని అన్నారు. అపరిచితులు కనిపిస్తే, అనుమానస్పదంగా ఏ వస్తువైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
సెక్యూరిటీ గార్డులకు మూడు రోజుల పాటు శిక్షణ కూడా ఉంటుందని, తప్పక పాల్గొనాలని పేర్కొన్నారు. ఆసీఫ్‌నగర్ ఏసిపి గౌస్ మైహినుద్దిన్ మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డులు కంటిమీద కునుకు లేకుండా ఉండాలని గుర్తుచేశారు. వంద మీటర్లు వరకు సెక్యూరిటీ గార్డుల దృష్టి ఉండాలని పేర్కొన్నారు. బ్యాంక్‌లలో, ఏటీఎం సెంటర్ లలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో హుమాయూన్‌నగర్, టప్పాఛబుత్రా, ఆసీఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు ఎస్.రవీందర్, వెంకటేశ్వర్లు, బండారి రవీందర్ పాల్గొన్నారు.

కార్యకర్తల కృషితో గెలుపు తథ్యం
హయత్‌నగర్, డిసెంబర్ 1: కార్యకర్తలు బూత్‌స్థాయి నుండి కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే గెలుపు ఖాయమని ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హయత్‌నగర్ డివిజన్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సిఎం కేసిఆర్ మాయమాటలను ఎండగట్టాలని తెలిపారు. తెరాస కార్యకర్తలు అనైతిక చర్యలకు పాల్పడుతూ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా ఉన్నారని, ఐక్యంగా ముందుకెళ్తూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చాను. కార్యక్రమంలో నాయకులు ధన్‌రాజ్, చంద్రశేఖర్‌రావు, చెన్నగోని శ్రీ్ధర్‌గౌడ్, గజ్జి శ్రీనివాస్, గజ్జి భాస్కర్, గజ్జి అశోక్, రవిగౌడ్, సందీప్ పాల్గొన్నారు.

ఉప్పల్ రింగ్‌రోడ్డులో
హెచ్‌ఎంఆర్ మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్
ఉప్పల్, డిసెంబర్ 1: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైలు డిపో, స్టేషన్లకు వచ్చే ప్రయాణీకులకోసం ఉప్పల్ రింగ్‌రోడ్డులో మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఉప్పల్ రింగ్‌రోడ్డులోని నాగోల్ రోడ్డులో ఎడమవైపున జాతీయ రహదారిలో ఉన్న కస్టోడియన్ ప్రాపర్టీస్థలంలో 20 గుంటల స్థలాన్ని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖరీదుకోసం స్థల యజమాని వద్ద తీసుకుంటున్నట్లు హెచ్‌ఎంఆర్ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్ కుమార్ సైని స్థలాన్ని పరిశీలించారు. నగర శివారు జిల్లాల నుండి నగరానికి వచ్చి వివిధ ప్రాంతాలకు రైలులో వెళ్లేందుకు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ మాడల్ మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్‌ను నిర్మించడానికి హెచ్‌ఎంఆర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.