రంగారెడ్డి

వైస్ చాన్సలర్‌ను తొలగించే వరకూ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 28: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అప్పారావుని తొలగించేవరకు ఉద్యమం కొనసాగుతుందని జెఎసి నాయకులు చెప్పారు. యూనివర్సిటీలో జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వర్సిటీల బంద్ పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థి జెఎసి నేతలు మాట్లాడుతూ, అరెస్టు చేసిన విద్యార్థులను, ప్రొఫెసర్లపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేసారు. విద్యార్థుల బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నందున పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం బెయిల్‌పై అభ్యంతరం చెప్పకూడదని వారు కోరారు. రోహిత్ వేముల చట్టం తెచ్చేవరకు ఉద్యమం జరుగుతుందని కేంద్రం చట్టం చేసేందుకు చొరవ చూపాలని సూచించారు. విద్యార్థులను రెచ్చగొట్టి కేసుల్లో ఇరికించేందుకు వైస్ చాన్సలర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ కమ్మయ్యతో ఏర్పాటుచేసిన కమిటీని తాము అంగీకరించడంలేదని, దీనివలన ఎలాంటి ప్రయోజనం లేదని నాయకులు చెప్పారు. వర్సిటీలో విద్యార్థులు చనిపోయినప్పుడల్లా కమిటీలు వేసారని, ఆత్మహత్యలు ఆగాయా అని ప్రశ్నించారు. కమ్మయ్య కమిటీ కూడా వైస్ ఛాన్సలర్ కనుసన్నల్లో మెలిగే రిజిస్ట్రార్ వేసిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వం విసిని మార్చేవరకు పోరాటం చేస్తామని ఎనే్నళ్లయినా ఉద్యమం ఆగదని వారు వివరించారు.