రంగారెడ్డి

ఎంపీపీ పీఠంపై టీఆర్‌ఎస్‌లో గ్రూపు రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జూలై 17: మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై యాచారం అధికార టీఆర్‌ఎస్ గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. టీఆర్‌ఎస్‌లో గ్రూపు తగాదాలతో నాటకీయ పరిణామాల మధ్యన టీఆర్‌ఎస్ నుంచి ఎంపీపీగా జ్యోతి నాయక్ రాజీనామా చేశారు. పదవీ వ్యామోహంతో ఆశావాహులు అవిశ్వాసానికి పట్టుబట్టారు. అసంతృప్తికి గురై జ్యోతి నాయక్ సోమవారం రాజీనామా లేఖను జడ్పీసీఈవో రాజేశ్వర్ రెడ్డికి సమర్పించారు. వెంటనే జ్యోతి నాయక్ రాజీనామాను ఆమోదించి, వైస్ ఎంపీపీగా ఉన్న గజ్జి రామకృష్ణకు ఇన్‌చార్జి ఎంపీపీగా బాధ్యతలు అప్పగించారు. ఎంపీటీసీలలోని అసమ్మతి నేతలు, ఆశావాహులు గజ్జి రామకృష్ణపై కూడా అవిశ్వాసానికి నోటీసులిచ్చారు. ఈ సంఘటనలతో యాచారం టీఆర్‌ఎస్‌లో గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. అవిశ్వాసానికి పట్టుబట్టి పావులు కదపడంతో జ్యోతి నాయక్ ఎట్టకేలకు మంగళవారం రాజీనామా చేశారు. దీనిని అదునుగా భావించి నందివనపర్తి ఎంపీటీసీ రజిత, మేడిపల్లి ఎంపీటీసీ అరవింద్ నాయక్ తమలో ఒకరు ఎంపీపీగా కావాలని ఎంపీటీసీల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జ్యోతి నాయక్ రాజీనామాతో ఇన్‌చార్జి ఎంపీపీగా వైస్ ఎంపీపీ రామకృష్ణ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆర్డీవో మధూకర్ రెడ్డికి ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేశారు. యాచారంలో పదవుల కోసం ఎంపీటీసీలు చేస్తున్న రాజకీయాలు టీఆర్‌ఎస్‌లో ముసలం సృష్టిస్తున్నాయి. ఎంపీపీ పదవికి మరో ఏడాది కాలం ఉండడంతో ఏడాది కాలమైన తాము మండల పరిషత్ అధ్యక్ష పీఠంలో కూర్చోవాలని ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు.