రంగారెడ్డి

జిల్లాలో 522 సీసీ కెమెరాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూలై 17: వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 522 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ టీ.అన్నపూర్ణ వెల్లడించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలిస్ స్టేషన్‌ల వారీగా నమోదైన కేసుల వివరాలను, పెండింగ్‌లో ఉన్న దర్యాప్తు కేసులను, పీటీ, ఎన్‌బీడబ్ల్యూ, కంపౌండింగ్, ఈ-పిట్టీ కేసుల వివరాలను, క్వాలిటీ ఆఫ్ ఇనె్వస్టిగేషన్ గురించి ఆన్‌లైన్ రివ్యూ ద్వారా తెలుసుకున్నారు. లాంగ్ పెండింగ్ కేసుల్లో ఏమైనా ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్స్, ఎంసీ రిపోర్ట్స్, ఎంవీఐకి సంబంధించి, లాండ్ కేసుల్లో ఏమైనా రిపోర్ట్స్ పెండింగ్‌లో ఉంటే సబ్ డివిజన్‌ల వారీగా డీఎస్‌పీలు యూఐ మేళాను నిర్వహించి పెండింగ్ కేసులను పూర్తి చేయాలని సూచించారు. ఏమైనా సమస్యాత్మకమైన కేసులుంటే రిటైర్డ్ పోలీసు అధికారులు, లీగల్ అడ్వైజర్ సలహా తీసుకుని కేసులను పూర్తి చేయాలని తెలిపారు. కమ్యూనిటి పోలిసింగ్, నేను సైతం కార్యక్రమంలో ఆయా పోలిస్ స్టేషన్ పరిధుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వివరాలను గురించి తెలుసుకుని ఆయా మండల అధికారులతో, గ్రామాల్లోని సర్పంచ్ మిగతా గ్రామ పెద్దలతో మాట్లాడి సీసీ కెమెరాల ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేసి సీసీ కెమెరాల ఏర్పాటులో తోడ్పడేలా చేయాలని చెప్పారు. పీఎస్‌ల వారీగా ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వివరాలను తెలుసుకున్నారు. వికారాబాద్ పోలిస్ స్టేషన్ పరిధిలో 100, పరిగిలో 74, తాండూర్‌లో 55 కెమెరాలు ఏర్పాటు చేశారని, ఏర్పాటు చేయని పీఎస్ పరిధుల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సీసీ టీవీల పనితీరును ప్రతిరోజు డీఎస్‌ఆర్‌లో తెలియజేయాలని, సీసీ కెమెరా 365 రోజుల్లో నమోదైన కేసుల్లో ఒక్క కేసును ఛేదించినా చాలని వివరించారు. సీసీ టీవీల ఉపయోగం నేరస్థలంలో పోషించే పాత్ర గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలిపారు. 5ఎస్ ప్రాజెక్ట్ గురించి డీఎస్పీ శిరీష రాఘవేంద్ర చెప్పారు. సార్ట్, స్ట్రెచెన్, షైన్, స్టాండర్డైజ్, సుస్టెన్, 100 డయల్ వచ్చినపుడు బ్లూకోట్స్ ఏ విధంగా వాటిని క్లోజ్ చేయాలో ఐటీసీటీ కేశవులు వివరించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత, ఈ-పిట్టీ కేసుల నమోదు, హిస్టరీ షీట్ ఓపెనింగ్, పీడీ చట్టం, గ్రేవ్ కేసులు, సీసీ టీవీల ఏర్పాటు, లోక్ అదాలత్‌లను ప్రామాణికంగా తీసుకుని జిల్లా ఎస్పీ రివార్డులను అందజేశారు. డీపీవో నిర్వణలో జిల్లా అదనపు ఎస్పీ పీ.నర్సింలుకు, 5 స్‌కు గాను వికారాబాద్ డీఎస్పీ శిరీష రాఘవేంద్రకు, ఈ పిట్టీ కేసుల్లో తాండూర్ డీఎస్పీ రామచంద్రుడు, పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌లకు, సీసీటీవీ ప్రెజెంటేషన్‌లో పీసీఆర్ సీఐ శ్రీనివాసులుకు, సీసీఎస్ పీఎస్ నిర్వహణకు సీఐ శ్రీనివాసులు, మైదాన నిర్వహణలో ఆర్‌ఐ వెంకటేశ్వర్లుకు, పాత కేసుల్లో చార్జిషీట్ వేసినందుకు ధారూర్ ఎస్‌ఐకి, పోకో కేసులో సీఐ ఉపేందర్, కోట్‌పల్లి ఎస్‌ఐకి, సీసీటీఎన్ పనిలో సీఐ వీ.దాసు, ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి, లోక్ అదాలత్‌లో పరిగి సర్కిల్‌కు, యూఐ కేసుల్లో కరణ్‌కోట్, వికారాబాద్ పోలీస్ స్టేషన్ అధికారులకు రివార్డులను అందజేశారు.