రంగారెడ్డి

యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూలై 17: వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నందున యుద్ధప్రాతిపదికన అధికారులు మొక్కలు నాటించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మట్లాడుతూ ఈ సమయంలో మొక్కలు నాటినట్లయితే వందశాతం బతుకుతాయని తెలిపారు. జిల్లాలో ఏ ఒక్క రోడ్డును వదలకుండా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని అన్నారు. గ్రామ పంచాయతీలు, మండల స్ధాయిలో ఐకానిక్ ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మొక్కలు నాటడానికి ముందు ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ అధికారులను ఎంపీడీవోలు సంప్రదించి గుంతలు తీయించాలని సూచించారు.
అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఎంపీడీఓలతో, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇంటింటికీ సరఫరా చేసే మొక్కలను గుంతలు తీసిన తరువాతనే అందజేయాలని తెలిపారు. పాఠశాల విదార్థులు పెద్ద ఎత్తున పాల్గొనేలా ర్యాలీలు, మానవాహారాలు నిర్వహించాలని వివరించారు. హరితహారం ఉపయోగాలపై విద్యార్థుల్లో అవగాహన, ఆలోచన పెంచేందుకు వ్యాసరచన, ఉపన్యాల పోటీలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. జేసీ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో విజయ కుమారి, డీఎఫ్‌ఓ సుధాకర్ రెడ్డి, డీపీఓ సురేశ్ మోహన్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి సంరక్షించాలి
ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, మూడు సంవత్సరాలు సంరక్షించాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇగ్నేట్‌మైండ్స్ స్వచ్ఛంద సంస్థ.. ఆబ్దుల్ కలాం స్ఫూర్తితో కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. కలెక్టర్ రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆశయాల మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో ఆరోగ్య కరమైన వాతావరణంలో జీవిస్తారని అన్నారు. ప్రతి మనిషికి సంవత్సరానికి 280 కేజీల ఆక్సిజన్ అవసరం అవుతుందని, లీటర్ ఆక్సిజన్ 1300 వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, సంవత్సరానికి రూ.3.64లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఒక్క చెట్టు సంవత్సరానికి 300 కేజీల ఆక్సిజన్ విడుదల చేస్తుందని పేర్కొన్నారు. నాటిన మొక్కల వద్ధ కలెక్టర్, జేసీ సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో విజయ కుమారి, డీఎఫ్‌ఓ సుధాకర్ రెడ్డి, డీపీఓ సురేశ్ మోహన్ పాల్గొన్నారు.