హైదరాబాద్

రంగారెడ్డి జిల్లా భూములమ్మి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఖర్చు చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 1: రంగారెడ్డి జిల్లాలోని భూములమ్మగా వచ్చిన 400 కోట్ల రూపాయలతో కరీంనగర్, వరంగల్ జిల్లాలను అభివృద్ది చేస్తారా అని మాజీ హోం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మంగళవారం నవాబ్‌పేట జడ్పిటిసి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పూలపల్లి గ్రామంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని భూములమ్మగా వచ్చిన 400 కోట్ల రూపాయలను కరవుతో అల్లాడుతున్న జిల్లా ప్రజల కోసం ఖర్చు చేయకపోవడం విడ్డూరమని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతు కూలీలను ఆదుకోవాలని కనీసం 100 రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసిందని, ఇపుడు వర్షాలు కురియక జిల్లాలో కరవు విలయతాండవం చేస్తున్నా పని కల్పించకపోవడం ఆశ్చర్యకరమని చెప్పారు.
ప్రాణహిత చేవెళ్ల ద్వారా నవాబ్‌పేట మండలంలోని వేలాది ఎకరాలకు నీరందించాలని ప్రణాళిక రూపొందిస్తే దాన్ని శంకర్‌పల్లికే పరిమితం చేశారని, రంగారెడ్డి జిల్లాపై కక్షగట్టారని అలాంటి వారిని గద్దె దింపాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
నవాబ్‌పేట మండల సమస్యలు జిల్లా పరిషత్‌లో పోరాడేందుకు కాంగ్రెస్ అభ్యర్థి మల్లారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రాణహిత చేవెళ్ళను రంగారెడ్డి జిల్లాకు తేవాలని జిల్లా పరిషత్‌లో తీర్మానం చేయాలని డిమాండ్ చేసిన వారిని గెంటేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతు కష్టమొచ్చిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తిస్తారని పేర్కొన్నారు.
అంత్యోదయ పథకం బియ్యాన్ని ఇవ్వకపోగా, ఇంటికో పింఛను ఇచ్చి ఇక్కట్లపాలు చేస్తున్నారని తెలిపారు. ఆరేళ్ళలోపు పిల్లలకు బియ్యం రద్దు చేసిన ప్రభుత్వం, అభయహస్తాన్ని మాయం చేశారని విమర్శించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం పలురకాలుగా బెదిరించినా టిఆర్‌ఎస్‌లో చేరలేదన్నారు.
మోసం చేసిన కెసిఆర్ పార్టీకి ఓటు వేయొద్దు
తెలంగాణ ఏర్పడితే మొదటి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తామని ప్రకటించి మోసం చేసిన కెసిఆర్ పార్టీకి ఏ ఒక్క దళితుడు ఓటు వేయకూడదని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ పిలుపునిచ్చారు. పేద దళిత, గిరిజనుల కోసం రూపొందించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అమలు చేయకుండా వేరే పథకాలకు నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. మరలా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, జడ్పిటిసి ఉప ఎన్నికలో యువకుడైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్, నాయకులు వెంకటస్వామి, కార్తీక్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఎల్.శశాంక్‌రెడ్డి పాల్గొన్నారు.