రంగారెడ్డి

షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అసమ్మతి ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, సెప్టెంబర్ 11: సిట్టింగ్ ఎమ్మెల్యే అంజన్నకు ఇచ్చిన టీఆర్‌ఎస్ టికెట్‌ను అధిష్టానం వెనక్కి తీసుకొని సీనియర్ నేత వీర్లపల్లి శంకర్‌కు ఇవ్వాలని అసమ్మతి నేతల కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని భగీరథ కాలనీ, ఏబీ కాంప్లెక్స్ నుంచి టీఆర్‌ఎస్ అసమ్మతి నేతల కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ముఖ్యకూడలిలో ధర్నా చేపట్టారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో స్థానిక టౌన్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని టీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని వదలిపెట్టారు. మాజీ సర్పంచులు కావలి కృష్ణ, కొమ్ము కృష్ణ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ టికెట్ విషయంలో కార్యకర్తలు, సీనియర్ నేతలతో ఎలాంటి చర్చలు చేయకుండా మూడు సార్లు ఒకే వ్యక్తికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు శ్రావణ్ కుమార్, ఎమ్మె సత్తయ్య, జంగారి రవి, శ్రీశైలం గౌడ్, భగవాన్ దాస్, దేవగిరి అశోక్, దేవగిరి రామకృష్ణ, చిల్కమర్రి నర్సింలు, మల్లేష్, సుధాకర్, దిలీప్ కుమార్, నందిగామ మల్లేష్ పాల్గొన్నారు.

పదవులు అనుభవించి టిక్కెట్ రాలేదని పార్టీని వీడతారా?
ఉప్పల్, సెప్టెంబర్ 11: కాంగ్రెస్ పార్టీలో పని చేసి పదవులు అనుభవించారు.. ప్రస్తుతం టిక్కెట్ రాలేదని పార్టీని వీడతారా అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మా రెడ్డి, ఉప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివా రెడ్డి, కే.సుధాకర్ రావు శెట్టి, లాలయ్య నాయక్, మంజుల, బూర్గుల రమేశ్ గౌడ్, ఎండీరఫిక్.. పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న బండారు లక్ష్మారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హబ్సిగూడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో ఏళ్ల తరబడి పని చేస్తున్న ఎందరో కురువృద్ధులు ఉండగా బండారు రాజిరెడ్డి పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే అయ్యారని తెలిపారు. ఆరోగ్యం సహకరించడంలేదని తమ్ముడు లక్ష్మారెడ్డికి గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఓటమి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నరేందర్, నర్సింహా రెడ్డి, ఆషు, గణేష్, సమ్మద్, రవీందర్, సంజయ్, మాలూ నాయక్, మల్లేష్, సుధాకర్ చారి పాల్గొన్నారు.

బలహీన వర్గాలఅభివృద్ధికి కాంగ్రెస్ కృషి
*మాజీ మంత్రి సబితా రెడ్డి
బాలాపూర్, సెప్టెంబర్ 11: పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందని మాజీ మంత్రి పీ.సబితారెడ్డి అన్నారు. ఆర్.శ్రీను నాయక్ మీర్‌పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా సోమవారం రాత్రి మీర్‌పేట్- లెనిన్‌నగర్‌లో ఏర్పాటుచేసిన అభినందన సభకు ముఖ్యఅతిథిగా సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటుచేసి, నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మీర్‌పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె జంగయ్య గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సామిడి గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామిడి రాంరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమిడి జంగారెడ్డి, గుర్రం వెంకట్ రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, కర్రె బల్వంత్, డీసీసీ ఉపాధ్యక్షుడు అంజా బాల్‌రాజ్, ఎంపీటీసీ అర్కల కామేష్ రెడ్డి, మహిళ బీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బండి మీనా నాగేష్ యాదవ్, పంతంగి మాధవి, నాగేష్ యాదవ్ పాల్గొన్నారు.