రంగారెడ్డి

మంత్రి, ఎంపీతో ఫలించని చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, సెప్టెంబర్ 12: టీఆర్‌ఎస్ అసమ్మతి నేతల బుజ్జగింపుల చర్చలు విఫలమయ్యాయి. హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ ఎపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో షాద్‌నగర్ టీఆర్‌ఎస్ అసమ్మతి నేతల వర్గీయులతో మంగళవారం సాయంత్రం చర్చలు నిర్వహించారు. చర్చల్లో అంజన్నకు ఇచ్చిన టికెట్‌ను వెనక్కి తీసుకోవాలని టీఆర్‌ఎస్ అసమ్మతి వర్గీయులు డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, ప్రస్తుతం నిర్వహించనున్న ఎన్నికల్లో అవకాశం ఇస్తామని చెప్పి తీరా సిట్టింగ్ కోటాలో అంజయ్య యాదవ్‌కు టికెట్ ఇవ్వడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి బుజ్జగించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. విభేదాలను పక్కన పెట్టిన ఏకతాటిపై ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు టికెట్ పొందిన అంజయ్య యాదవ్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి కోరినప్పటికీ టీఆర్‌ఎస్ అసమ్మతి వర్గీయులు నిరాకరించడంతో చర్చలు విఫలమయ్యాయి. ఇటు టీఆర్‌ఎస్ అదిష్టానం నుండి ఎన్ని ఒత్తిడిలు వచ్చినా పక్కన పెట్టి జనం మద్దతు కూడగట్టుకోవడంలో అసమ్మతి నేతలు బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే కొత్తూరు, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, కేశంపేట మండల నుండి కార్యకర్తల మద్దతు రోజురోజుకు పెరుగుతూనే ఉందని అసమ్మతి నేతలు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ విషయంలో టీఆర్‌ఎస్ నాన్చుడు ధోరణి అవలంభిస్తే రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఎవరి బలం ఏమిటో ఎన్నికల్లో చూసుకుందామంటూ టీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు సవాల్ చేస్తున్నారు. పార్టీ బీఫాం అసమ్మతి వర్గంలోని ఒకరికి ఇచ్చేందుకు అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటు అందె బాబయ్య వర్గం.. అటు వీర్లపల్లి శంకర్ వర్గం కలిసి మండలాల వారీగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కార్యకర్తల మద్దతు కూడగట్టుకుంటున్నారు.
అంజన్నకు అటావో..
టీఆర్‌ఎస్‌కు బచ్చావో
కేశంపేట: అంజన్నకు అటావో..టీఆర్‌ఎస్‌కు బచ్చావో అంటూ.. టీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. బుధవారం కేశంపేట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు వీర్లపల్లి శంకర్, అందె బాబయ్యల ఆధ్వర్యంలో ప్రగతి ఆవేదన సభను ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు వీర్లపల్లి శంకర్, అందె బాబయ్య మాట్లాడుతూ 2014సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన వారం రోజుల నుంచి కార్యకర్తలను దూరం పెట్టిన ఏకైక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని, నివేదికలు తయారు చేసి అంజన్నకు ఇస్తే వాటిని పక్కన పెట్టి అంజన్న కుమారులు చెప్పిన విధంగా నడుచుకున్నారని వివరించారు. 20సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్నప్పటికి అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ పీ.శంకర్ రావుతో ఎలాంటి విభేదాలు రాలేవని, కానీ ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో గెలిచిన వారం రోజుల్లోనే విభేదాలు వచ్చాయని వివరించారు. బహిరంగ సభలో టీఆర్‌ఎస్ నేతలు సొమిరెడ్డి నరేందర్ రెడ్డి, గున్న భీమయ్య, మంగులాల్ నాయక్, చంద్రయ్య, ఎమ్మె సత్తయ్య, విఠల్ ముదిరాజ్, వెంకట్ రెడ్డి, దిలీప్, శ్రీశైలం గౌడ్, యాదయ్య, చంద్రయ్య, అంచరాములు, అంచ రాజు, నల్లమోని శ్రీ్ధర్, గుంటి శంకర్, రాఘవేందర్, రవి, శ్రీనివాస్, అంజయ్య, శ్రీ్ధర్‌వర్మ, కుమార్, గోపాల్ పాల్గొన్నారు.