రంగారెడ్డి

పొత్తు వద్దు ఒంటరిగానే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, సెప్టెంబర్ 17: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తు వద్దే వద్దని..ఒంటరిగానే పోటీ చేస్తే మంచిది. పొత్తు అనివార్యమైతే గెలిచే ఉప్పల్ సీటును కాంగ్రెస్‌కే కేటాయించాలి.. స్థానికేతరులకు అవకాశం ఇవ్వకుండా స్థానిక వ్యక్తికే టిక్కెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని పార్టీ ఉప్పల్ సర్కిల్ కమిటీ అభిప్రాయపడింది. సోమవారం ఉప్పల్‌లో పార్టీ అధ్యక్షుడు ముశ్యం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శక్తి యాప్ ఉప్పల్ ఇన్‌చార్జీ గంట సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివా రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుబ్బ నర్సింహా రెడ్డి, కంది ఆగి రెడ్డి, షేక్ బుడేసాహెబ్, రాగిడి లక్ష్మా రెడ్డి, ఏసూరి యాదగిరి, పీసీసీ కార్యదర్శిలు పసుల ప్రభాకర్ రెడ్డి, జీ.జితేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఏసూరి యాదగిరి, ఆవులగడ్డ శ్రీనివాస యాదవ్, బొరెంపాటి కృష్ణ, వినోద్, మోహన్ 200 మంది పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట అని అభివర్ణించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానికేతరులకే టిక్కెట్ ఇస్తే గెలిపించామని, ఇంకెన్నాళ్లు జెండాలు మోయాలని, మాలో సమర్థులే లేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడైన శివారెడ్డికి టిక్కెట్ ఇస్తే భారీ మెజార్టీతో పొత్తు విషయంలో క్లారిటీ లేదని, కాంగ్రెస్‌కు ఉప్పల్ సీటును కేటాయించాలని అధిష్ఠానంపై ఒత్తిడీ తీసుకరావాలని తెలిపారు. బండారు లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోతే పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపించగలమని ధీమా వ్యక్తం చేశారు.