రంగారెడ్డి

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17: కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.్భక్షపతి యాదవ్ అన్నారు. చందానగర్‌లోని శంకర్ నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో భిక్షపతి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మద్దతిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రవికుమార్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, కట్ల రఘుపతి రెడ్డి, దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, మూగల రఘునందన్ రెడ్డి, వీబీ.అనంత రెడ్డి, గొల్లపల్లి లక్ష్మారెడ్డి, కాలనీ నాయకుడు సంజీవ రెడ్డి, శివ పూర్ణయ్య, ఎస్‌ఎస్.రావు, రాజు, కృష్ణమూర్తి, చౌదరి, రియాజుద్దీన్ పాల్గొన్నారు.
వికారాబాద్ పరిసర గ్రామాల్లో భారీ వర్షం
వికారాబాద్, సెప్టెంబర్ 17: వికారాబాద్ ప్రాంతంలో సోమవారం విచిత్రకరమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. ఉదయం తొమ్మిది గంటలకు భానుడు ప్రతాపం చూపగా మధ్యాహ్నం రెండు గంటలకు ఆకాశం మేఘాలతో కమ్ముకోవడం, మబ్బులు ఏర్పడటంతో కొంత చీకటి ఏర్పడింది. ఎంత పెద్ద వర్షం కురుస్తుందో అన్నట్టుగా కనిపించినా జిల్లా కేంద్రంలో చిన్నపాటి వర్షం కురిసింది. పరిసర గ్రామాల్లో మాత్రం భారీ వర్షం కురిసింది. ఆదివారం అక్కడక్కడ కురిసిన వర్షాలకు పంటలకు ఎరువులు చల్లేందుకు కొనుగోలుకు సోమవారం జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు.

మహేశ్వరం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మహేశ్వరం, సెప్టెంబర్ 17: మహేశ్వరం మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడి పంటలు పూర్తి ఎండిపోయినందున మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించించి మెట్టరైతులకు పరిహారం చెల్లించాలని మండల సభ ఎంపీపీ స్నేహ అధ్యక్షతన సమావేశం కాగానే ఎంపీటీసీ సభ్యుడు శ్రీశైలం కరువు పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సభ దృష్టికి తేవడంతో సభ్యులందరు ఏకీభవించారు. మంచినీటి సరఫరా పారిశ్యుద్ధ పనులు వేంటనే చేపట్టడంలో ప్రత్యేధికారులు పూర్తిగా విఫలమయ్యారని సభ్యులు అధికారులను నిలదీశారు. ఎంపీడీవో బీ.నీరజా రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు ప్రతి రోజు పంచాయతీలపై దృష్టిసారించి సమస్యలు వెంటనే పరిష్కారించాలని సూచించారు. మిషన్ భగీరథ పైపులైన్లు కోసం గ్రామాల్లో గొతులు తవ్వి అసంపూర్తిగా వదిలివేయడంతో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఎన్.ఈశ్వర్‌నాయక్, వైస్ ఎంపీపీ ఎం.స్వప్న, తహశీల్దార్ ఆర్‌పీ.జ్యోతి, ఏడీఎ సూజత, ఎంఈవో కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి పాల్గొన్నారు.