రంగారెడ్డి

నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలన విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలన ఓ పెద్ద ఫెయిల్యూర్ అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో, కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీఆర్‌ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో చేపట్టిన ప్రభుత్వ పథకాలనే నేటికీ రాష్ట్రంలో కేసీఆర్ కొనసాగించారని మండిపడ్డారు. పథకాలకు పేర్లు మార్చినంత మాత్రాన సరిపోదని అన్నారు. ప్రజలకు సేవ చేస్తున్నామనే ముసుగులో కేసీఆర్ కుటుంబీకులు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ప్రజలకు భరోసా ఇస్తున్నామని కేసీఆర్ గొప్పలు పలికి నేడు చేసిందేమీ లేదని అన్నారు. 99 శాతం హామీలను గాలికి వదిలేశారని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని గొప్పలు చెప్పి ఇవ్వలేదని గుర్తుచేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎంత మందికి ఇచ్చారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇంటింటికీ నీరివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు వేయమని అడుగుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొలన్ సుభాష్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, ప్రభాకర్ రెడ్డి, బద్ధం శ్రీకాంత్ రెడ్డి, పీ.జీవన్‌దాస్, క్రాంతి కుమార్, మజ్జిగ బాబురావు యాదవ్, పీ.శ్రీ్ధర్, శ్రీనివాస్ గౌడ్, ఏ.తనీష్ గౌడ్, దేవదాసు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కే.నవీన్ కుమార్, కే.ప్రవీణ్ కుమార్, వరప్రసాద్, టీ.అనంత, ఎం.యాదమ్మ యాదవ్, నీరజ, అంతమ్మ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిక
సబితా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో అత్తాపూర్‌కు చెందిన నేతలు చేరారు. టీఆర్‌ఎస్ పట్ల ప్రజలు విసుగెత్తి పోయారని సబిత అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం స్థానికంగా అక్రమ పాలన సాగించారని మండిపడ్డారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన గణనాథుని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.