రంగారెడ్డి

నిమజ్జనానికి తరలిన గణనాథులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 21: బొజ్జ గణపయ్య నవరాత్రులు ముగించుకొని నిమజ్జనానికి శుక్రవారం తరలివెళ్లాడు. తొమ్మిది రోజుల పాటు నిత్య, విశేష పూజలందుకున్న గణనాథుడు డప్పువాయిద్యాల మధ్య నిమజ్జనానికి వెళ్లాడు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని రాజేంద్రనగర్, బుద్వేల్, శివరాంపల్లి, ప్రేమావతిపేట్, అత్తాపూర్, హైదర్‌గూడ, అరాంఘర్, సాయిబాబానగర్, బుద్వేల్ రైల్వేస్టేషన్ బస్తీ, పద్మశాలిపురం, బాబుల్‌రెడ్డినగర్, మైలార్‌దేవ్‌పల్లి, ఉడంగడ్డ వంటి ప్రాంతాల్లో నెలకొల్పిన బొజ్జ గణపయ్యలను నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం సందర్భంగా సర్కిల్ పరిధిలో ఉన్న పత్తికుంట చెరువు, ఉడంగడ్డ వద్ద పల్లె చెరువు వద్ద జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్ సిబ్బంది సంయుక్తంగా ఏర్పాట్లను చేశారు. పత్తికుంట చెరువు, పల్లె చెరువులలో నిమజ్జనాన్ని పురస్కరించుకొని సర్కిల్‌లోని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏసీపీ అశోక్ మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్లతో సంయుక్తంగా భద్రతను పర్యవేక్షించారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ టీ.ప్రేమ్‌దాస్ గౌడ్.. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని భక్తులు, ప్రజల కోసం అన్నదాన, ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.. భవానీకాలనీ, వాంబేకాలనీ, పద్మశాలిపురం, మైలార్‌దేవ్‌పల్లి, శ్రీరాంనగర్, పల్లె చెరువు, రాజేంద్రనగర్, వెంకటేశ్వరకాలనీ, నేతాజీనగర్, శివరాంపల్లి తదితర ప్రాంతాల్లో గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య ఆకాంక్షించారు. సాయినగర్‌లో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు బాలపోచయ్య, సత్తం రమేష్ పాల్గొన్నారు.