రంగారెడ్డి

భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరునికి పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, సెప్టెంబర్ 21: పట్టణంలోని కాలేజీ రోడ్డు, టీచర్స్ కాలనీ, విజయనగర్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, పరిగిరోడ్డు, లక్ష్మీనర్సింహాకాలనీ, తిరుమలకాలనీలోని వినాయక మండపాల వద్ద విఘ్నశ్వర స్వామికి ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బైపాస్ రోడ్డులో శివహనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామికి టీఆర్‌ఎస్ నాయకులు వీర్లపల్లి శంకర్, అందె బాబయ్య ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి గ్రామంలో తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి విఘ్నేశ్వర స్వామికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఇస్నాతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వర స్వామికి శ్రీవర్ధన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గణపతి మండపాల్లో జోరుగా అన్నదానం చేసారు. గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్ డివిజన్‌లలోని పలు బస్తీలలో ఏర్పాటు చేసిన గణపతి మండపాల్లో కేపీ వివేక్ ప్రత్యేక పూజలు చేశారు. జగద్గిరిగుట్ట బస్టాప్‌లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో మర్చంట్ అసోసియేషన్ సభ్యులు, యువకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగద్గిరినగర్ విజ్ఞనాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో టీఆర్‌ఎస్ నేత కేఎం ప్రతాప్, కార్పొరేటర్ జగన్ విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు.
బాలాపూర్: గణనాథుని అశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో బాగుండాలని మాజీ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి ఆకాక్షించారు. బడంగ్‌పేట్ మున్సిపాలిటీ రెండవ వార్డు ఏజీఆర్ కాలనీలో ఏర్పాటుచేసిన వినాయకునికి గురువారం రాత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక కౌన్సిలర్ భీమిడి స్వప్న జంగారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కంబాలపల్లి ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు సబితా ఇద్రారెడ్డి, కౌన్సిలర్ భీమిడి స్వప్న జంగారెడ్డిని శాలువతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బడంగ్‌పేట్ మున్సిపాలిటీ కోట మైసమ్మ దేవాలయం ప్రాంగణంలో కొలుదీరిన గణనాథునికి బడంగ్‌పేట్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సామ నర్సింహ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మేడ్చల్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొల్పిన వినాయక మండపాల వద్ద భక్తులు భక్తిపారవశ్యంతో వినాయకుడికి పూజలు నిర్వహించి తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. నిమజ్జనానికి మరో రోజే మిగిలి ఉండటంతో మండపాల వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. పట్టణంలోని సూర్యనగర్ కాలనీలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీవాసులు సంజీవ రావు, శంకర్, వెంకట్ రెడ్డి హరివర్ధన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. టీఆర్‌ఎస్ నేతలు శేఖర్ గౌడ్, సురేందర్, నవీన్ రెడ్డి పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీకాలనీ: గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణనాథుడికి పలువురు నేతలు పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఘట్‌కేసర్: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘట్‌కేసర్‌లో శివాస్ రాజేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రభాకర్ గౌడ్ శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపారు. నవరాత్రి ఉత్సవాలను ప్రతిఒక్కరు కులమతాలకతీతంగా స్నేహ పూర్వకంగా జరుపుకోవాలని సూచించారు. ప్రభాకర్ గౌడ్ వెంట టీఆర్‌ఏస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మీసాల మల్లేష్, బొమ్మక్ శ్రీనివాస్, ఎంపీటీసీలు శ్రీశైలం, బద్రినారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఎన్‌ఎఫ్‌సీనగర్ సర్పంచ్ స్టివెన్ పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి: గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం మండపాల వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు. హఫీజ్‌పేట డివిజన్‌లోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద జరిపిన పూజాకార్యక్రమంలో శేరిలింగంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కాలనీ నాయకులు లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లేష్, సంజీవ రెడ్డి, నాగభూషణం, నిర్వాహకులు పాల్గొన్నారు. పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ గృహకల్పలో బంజారా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాన్ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దర్శించుకున్నారు. మియాపూర్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో జరిగిన పూజలో మియాపూర్ కార్పొరేటర్ మేకా రమేశ్, చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చందానగర్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని టీడీపీ సీనియర్ నేత మొవ్వా సత్యనారాయణ దర్శించుకున్నారు. అక్బర్ ఖాన్, కట్టా వెంకటేశ్ గౌడ్, ఉరిటి వెంకట్రావు, మనే్నపల్లి సాంబశివరావు, డీఎస్‌ఆర్‌కే ప్రసాద్, అస్లం పాల్గొన్నారు.