రంగారెడ్డి

రెసిడెన్షియల్ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థుల పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 21: యజమాన్యం నిర్లక్ష్యంతో రెసిడెన్షియల్ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు పారిపోయిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అవుషాపూర్‌లో శుక్రవారం తెల్లవారుఝామున జరిగింది. పోలీసులు, పాఠశాల యజమాన్యం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి అవుషాపూర్ గ్రామ సమీపంలోని ఎస్‌స్‌పీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో యదాద్రి జిల్లా పోచంపల్లికి చెందిన బండారి భాస్కర్ యాదవ్, ఉప్పల్ విజయపురి కాలనీకి గుగ్గులోతు వసంత్ కుమార్, మల్కాజిగిరి నెహ్రూనగర్‌కు చెందిన మాల్గ కౌశిక్ తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. శుక్రవారం తెల్లవారుఝామున ముగ్గురు విద్యార్థులు వ్యాయామానికని లేచి కొంత సేపు పాఠశాల ఆవరణలో తిరిగి పాఠశాలకు వెనుక వైపు ఉన్న రెండవ గేటు నుంచి పరారు అయినట్లు తెలిపారు. ఉదయం ఆరు గంటలకు విద్యార్థులలో ముగ్గురు కనపడక పోవటంతో అంతటా వెతికినట్లు తెలిపారు. ఒక విద్యార్థి తాను పాఠశాల నుంచివెళ్లిపోతున్నట్లు లేఖ పెట్టి వెళ్లినట్లు చెప్పారు. సీసీ పుటేజీలు పరిశీలించగా వెనుకాల ఉన్న గేటు నుంచి పరారైనట్లు తెలిసింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటంతో పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ పిల్లలు పారిపోయారని ఆరోపించారు. బయటకు వెళ్లే గేటుకు తాళం వేయకపోవటంతోనే పారిపోయారని నిలదీశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మూడు బృందాలుగా ఏర్పాటు చేసి విద్యార్ధులను గాలింపు చర్యలు చేపట్టారు. యజమాన్యంపై కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.పాఠశాలకు చేరుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఘట్‌కేసర్ డీఐ కిరణ్ కుమార్ తెలిపారు.