రంగారెడ్డి

మంత్రి వద్దకు అసమ్మతి నేతల పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, : టీఆర్‌ఎస్ అసమ్మతి నేతల పంచాయతీ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. మంత్రి కేటీఆర్‌తో ఆదివారం సాయంత్రం షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ అసమ్మతి నేతలు శంకర్, బాబయ్య సమావేశమయ్యారు. సుమారు 50మంది నేతలు హాజరై తమ అభిప్రాయాలను వెలిబుచ్చినట్లు తెలిసింది. అసమ్మతి నేతలు శంకర్, బాబయ్య వర్గీయులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వ్యవహార శైలిపై ఆరోపణలు చేసినట్లు తెలిసింది. గత సార్వత్రిక ఎన్నికలలో గెలుపునకు కృషి చేసిన తమను నాలుగేళ్లుగా అవమానాలకు గురిచేస్తూ వస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జరుగుతున్న సంఘటనలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే కేటీఆర్ సర్దుకుపోవాలని కేసీఆర్‌ను దృష్టిలో ఉంచుకుని పని చేయాలని హితవు పలికినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి, అంజయ్య యాదవ్‌తో ఫోనులో మాట్లాడినట్లు తెలిసింది. ఏకాభిప్రాయానికి రాలేనట్లు తెలుస్తోంది.

‘జాతీయవాదం నేటి అవసరం’

ప్రజ్ఞ్భారతి-తెలంగాణ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత డా.పసుపుల భాస్కరయోగి రచించిన ‘్ఫర్త్‌ఎస్టేట్’ పుస్తకావిష్కరణ సభ సోమవారం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పుస్తకావిష్కరణ గావించారు. ఫోర్ట్‌ఎస్టేట్ పుస్తకం నేటి సమాజంలో రాజకీయాల్లో మార్పులకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు. అక్షర రూపం దాల్చిన ఒక్కో సిరా చుక్క లక్ష మెదళ్ల కలయిక అని, పుస్తక రచయిత భాస్కరయోగి రచనలు కూడా కోటి మెదళ్లని కదిలిస్తున్నాయని అన్నారు. జాతీయ వాద భావజాలాన్ని విస్త్రృత పరచాల్సిన అవసరం ఉందని, జాతీయ వాదమే దేశాన్ని కాపాడుతుందని అన్నారు. ఇలాంటి రచయితలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశభక్తి అత్యావశక్యమని సూచించారు. సూడో సెక్యులర్ వాదులకు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనదేనని పేర్కొన్నారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పుస్తక సమీక్ష చేశారు. ప్రజ్ఞ్భారతి అధ్యక్షులు త్రిపురనేని హనుమాన్ చౌదరి మాట్లాడుతూ నేటి రచయితల్లో భారతీయ సంస్కృతిని అగ్రస్థానంలో నిలుపుతున్న వారిలో భాస్కరయోగి ఒకరు అని వివరించారు. భాస్కరయోగి వ్యాసాలు, రచనలు యువతకు మార్గనిర్దేశం చేస్తున్నాయని, నిద్రావస్తలో ఉన్న జాతిని జాగృతం చేస్తుందన్నారు. రచయిత భాస్కరయోగి మాట్లాడుతూ సెక్యులరిజం పేరుతో భారతీయతను నాశనం చేయటానికి జరుగుతున్న కుట్రలను అణిచివేసేందుకు ఫోర్ట్‌ఎస్టేట్ పునాదిగా ఉంటుందని, జాతీయ భావాన్ని రేకెత్తించేందుకు తాను రచనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్, ధర్మపురి అరవింద్, గోశాల శ్రీనివాస్, అప్పల ప్రసాద్, సాహిత్య పరిషత్, ప్రజ్ఞ్భారతి సభ్యులు పాల్గొన్నారు.