రంగారెడ్డి

జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 826786

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, అక్టోబర్ 15: జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 826786 అని అందులో పురుషులు 415043, స్ర్తిలు 411683, ఇతరులు 61 అని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. సోమవారం తన చాంబర్‌లో నిర్వహించిన అన్ని రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో 1095 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల వివరాలపై అన్ని రాజకీయ పార్టీలు అమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతీలాల్, సీపీవో జగన్నాథం పాల్గొన్నారు.
అంతారం ఎంపీటీసీ బీజేపీలో చేరిక
కులకచర్ల, అక్టోబర్ 15; కులకచర్ల మండలం అంతారం ఎంపీటీసీ పెంటీబాయి సోమవారం భాజపాలో చేరారు. కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ఎస్సీ, ఎస్టీలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ పంపిణీ చేయడం తననెంతో ఉద్వేగ పరిచిందని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న పార్టీకి తాము విధేయులమై ఉండకపోవడం భావ్యం కాదని భావించి భాజపాలో చేరుతున్నట్లు తెలిపారు. ఈమెతో పాటు తండాకు చెందిన అనేకమంది కూడా పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పరిగి నియోజకవర్గం నుంచి ఈ సారి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తామంతా కృషి చేస్తామని వారు తెలిపారు.
సీఎంగా మళ్లీ కేసీఆర్ పగ్గాలు చేపట్టడం ఖాయం
రాజేంద్రనగర్, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్లకుంట్ల చంద్రశేఖర్‌రావు తిరిగి ఎన్నిక కావడం ఖాయమని రాజేంద్రనగర్ టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని ఆయన ఎద్దేవా చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు కిరోసిన్ రాజు అతని అనుచరులతో కలిసి రాజేంద్రనగర్ మాజీ శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ సమక్షంలో టీ ఆర్ ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి ప్రకాష్‌గౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.