రంగారెడ్డి

సరస్వతీమాతగా దర్శనమిచ్చిన దుర్గామాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, అక్టోబర్ 15: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమిచ్చారు. రాంబాగ్‌లోని దుర్గామాత ఆలయంలో రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు ఉమామహేశ్వరిరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరిరెడ్డి మాట్లాడుతూ.. సరస్వతీ మాత అనుగ్రహంతో చిన్నారులకు మంచి విద్యాబుద్ధులు కలగాలన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో మహిళా బీజేపీ నాయకురాళ్లు పాల్గొన్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయిబాబానగర్‌లలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీనివాస్‌రెడ్డి శ్రీశైలంరెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఉప్పల్: దేవీ శరన్నవ రాత్రి మహోత్సవాల్లో భాగంగా ఉప్పల్‌లోని సీతారామ కాలనీలో దుర్గామాత సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బజారు జగన్నాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, అన్నదానం జరిగింది.
ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద నవదుర్గ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అన్నపూర్ణా దేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత మండపంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు టీ.వీరేందర్ గౌడ్, టీడీపీ మేడ్చల్ జిల్లా ఇంచార్జి కందికంటి అశోక్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు తిక్క ప్రకాష్, నేతలు వేణు, సాయి కుమార్, జంగారెడ్డి, లక్ష్మణ్ గౌడ్, ప్రవీణ్, జ్ఞానేశ్వర్, కోల రవి, పబ్బతి శేఖర్ రెడ్డి, బాలకృష్ణ పాల్గొని పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామంతాపూర్‌లోని న్యూగోఖలేనగర్‌లోని మహంకాళీ, శ్రీ ఊర పోచమ్మ ఆలయంలో తల్లి అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు. సామూహిక తులసి అర్చన, పూర్ణాహుతి, ప్రత్యేక హోమాలు, అర్చనలతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బోడుప్పల్‌లోని వివిధ కాలనీలలో నిర్వహించిన దుర్గామాత మండపాల వద్ద కాంగ్రెస్ బీ-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త కిషోర్‌గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మెహిదీపట్నం: దేవీ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఘనంగా అమ్మవారికి పూజలను మండప నిర్వాహకులు చేస్తున్నారు. సోమవారం అమ్మవారు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మండపాల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. బజార్‌ఘాట్ జంగం బస్తీలో బిజేపీ నేత హర్షవర్ధన్ యాదవ్ అమ్మవారికి పూజలను నిర్వహించారు.
మేడ్చల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ పట్టణంలో నెలకొల్పిన దుర్గామాత విగ్రహాన్ని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చేవెళ్ల: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేవెళ్లలోని శ్రీ లక్ష్మివెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళ్లలో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి స్వామివారికి అభిషేకం, వేదపారాయణం, అర్చన రాత్రి 8గంటలకు శేషవాహన సేవ నిర్వహించినట్లు పూజారులు తెలిపారు.