రంగారెడ్డి

దూంధాంగా బతుకమ్మ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కేంద్ర కార్యాలయంలో బతుకమ్మ సంబురాలను మహిళా ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలను కమిషనర్ డాక్టర్ బీ.జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. మహిళా ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ విశిష్ఠతను వివరించారు.
నేడు బతుకమ్మ పోటీల్లో బహుమతుల పంపిణీ.. హాజరు కానున్న సినీ నటి విజయశాంతి
బోడుప్పల్ పురపాలక సంఘం కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఏటా బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది కాలనీల వారీగా నిర్వహించిన సంబురాల్లో విజేతలకు మంగళవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఆవరణలో సినీ నటి విజయశాంతి బహుమతులను అందజేయనున్నట్లు మహిళా విభాగం ప్రతినిధులు రాపోలు సువర్ణ, విజయలక్ష్మి, సరిత, రష్మీ, చంద్రకళ, కవిత పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, సమాఖ్య చైర్మన్ రాపోలు రాములు, అధ్యక్షుడు బొమ్మక్ రమేశ్, సలహాదారులు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, చిత్తరంజన్, పాండు రంగా చారి హాజరవుతారని పేర్కొన్నారు.
రంగు రంగుల పూల గుబాళింపుతో శిల్పారామం
గచ్చిబౌలి: రంగు రంగుల చేనేత వస్త్రాలు ఒక వైపు, మరోవైపు వివిధ పూలతో తయారు చేసిన బతుకమ్మలు, కనువిందు చేసే సంస్కృతిక కార్యక్రమాలు అదనపు ఆకర్షణగా ఏర్పాటుచేసిన ఫ్లవర్ ఫెస్టివల్ శిల్పారామం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం వద్ద పువ్వులతో పేర్చిన బతుకమ్మ వద్ద ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్‌రావు కొబ్బరికాయ కొట్టి ఉత్సవాలు ప్రారంభించారు.