రంగారెడ్డి

సరదా సరదాగా దసరా సంబురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, అక్టోబర్ 19: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దసరా పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం విశ్వహిందు పరిషత్ నేత బండారి రమేష్ అధ్యక్షతన శివ మారుతీ దేవాలయం నుంచి పాలకేంద్రం వరకు పల్లకీ సేవ నిర్వహించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గునూరి విశ్వం, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దూది మల్లికార్జునప్ప, సహకార్యదర్శి మఠం రచయ్య, ప్రఖండ అధ్యక్షుడు బిజినేపల్లి రంగయ్య, సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో విజయ దశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
కొందుర్గు:కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిష్ఠించిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మ మహిళల ఆట, పాటలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి ఒకరికి ఒకరు సోదర భావంతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో ప్రతిష్ఠించిన విగ్రహ నిమజ్జన వేడుకలు ఆట, పాటలతో ఘనంగా నిర్వహించారు.
కేశంపేట: నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన దుర్గా దేవికి కేశంపేట జడ్పీటీసీ పల్లె నర్సింగ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శంకర్‌లు నిర్దవెల్లి గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పల్లాటి కృష్ణయ్య, రామలింగం, జంగయ్య, మల్లయ్య, ఆమేర్, రమేష్,, అజ్‌హర్, శేఖరప్ప, యువజన సంఘం సభ్యులు శివ, మహేష్, నిరంజన్, వెంకటేష్, వేణు, రవి, సాయిలు పాల్గొన్నారు.
కొత్తూరు: దసరా పండగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. కొత్తూరు, నందిగామ మండల కేంద్రాలతో పాటు మామిడిపల్లి, చేగూర్, నర్సప్పగూడ, వీర్లపల్లి, తదితర గ్రామాల్లో దసరా వేడుకలను నక్తి శ్రధ్ధలతో ఘనంగా జరుపుకున్నారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కీసర, అక్టోబర్ 19: కీసర మండలంలో నాగారం గ్రామంలోని రాజ్‌సుఖ్ నగర్, కీసర శివాజీనగర్ కాలనీ అసోషియేషన్ ఆధ్వర్యంలో యువకులు మహిషాసుర, రావణాసురుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు. దమ్మాయిగూడ, రాంపల్లి, కీసర, గోధుమకుంట, భోగారం, చీర్యాల, రాంపల్లిదాయర, యాద్‌గార్‌పల్లి, తిమ్మాయిపల్లి గ్రామాల్లోని ప్రజలు ప్రజాప్రతినిధులు జెమ్మి చెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకును బంగారంగా భావిస్తూ, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈమేరకు దేవి నవరాత్రుల్లో భాగంగా ఆయా గ్రామాల్లో నెలకొల్పిన దుర్గామాతలను ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేసారు. భవానీ మాలదారులు దీక్షను విరమించారు.
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో విజయ దశమి వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. నూతన వస్త్రాలను ధరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలను తెలుపుకున్నారు. రావణ దహన కార్యక్రమాలను నిర్వహించారు. జమ్మి చెట్టుకు పూజలు చేసి పావురాలను ఎగురవేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో మాజీ ఎమ్మెల్యే కేపీ వివేక్ ప్రత్యేక పూజలు చేశారు. జీడిమెట్ల డివిజన్ శ్రీ ఎన్‌క్లేవ్‌లో జరిగిన చండీ హామంలో వివేక్ పాల్గొన్నారు. గాజులరామారంలోని చిత్తారమ్మ ఆలయంలో రావణ దహన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి తెరాస నేత కేఎం ప్రతాప్ విచ్చేసి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం శాంతికి చిహ్నమైన పావురాలను పైకి ఎగురవేశారు. ఓం జెండాను ఎగురవేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని, విజయ దశమి పండుగ సందర్భంగా ప్రజలందరికి విజయాలు చేకూరాలని వేడుకున్నారు.
ఉప్పల్: దసరా సంబురాలు ఉప్పల్ పరిధిలోని పలు కాలనీల్లో ఘనంగా జరుపుకున్నారు. ఉప్పల్ భారత్ యువజన సంఘం, నవోదయ యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో వేలాది మంది పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. చిలుకా నగర్, రాంమాంతపూర్, హబ్సిగూడ, బోడుప్పల్‌లోని పలు యువజన సంఘాల నేతృత్వంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో ఎంపీ మల్లారెడ్డి, జెడ్పీటీసీ సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజక వర్గ ఇంచార్జి ఆర్ లక్ష్మారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, కార్పోరేటర్లు అనలా రెడ్డి, స్వప్న, జ్యోత్న, సరస్వతి పాల్గొన్నారు.
బొంరాస్‌పేట: దసరా పండుగ వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు.గురువారం వ్యాపారులు తమ యంత్రాలకు, దుకాణ సముదాయాల్లో పూజలు నిర్వహించారు. వాహనాలకు పూజలు నిర్వహించారు. ఇళ్లల్లో జమ్మిని తీసుకువచ్చి పూజలు జరిపారు. అనంతరం సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో స్వయం సేవకులు కవాతు చేస్తు ముందుకు కదలగా గ్రామస్థులు వారి వెంబడి వెళ్లి పూజలు నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో దసరా పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విజయదశమిని పురస్కరించుకొని దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలోని ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతినిష్టించిన అమ్మవారిని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంతో పాటు యాచారం, మంచాల మండలాల్లోనూ భక్తులు దేవాలయాలను దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఆయుధపూజ, వాహనాలకు పూజలు చేశారు. తెలంగాణ పోలీస్ ఐజీ బత్తుల శివధర్‌రెడ్డి తులేకలాన్ గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు కెవి రమేష్‌రాజు, కౌన్లిలర్‌లు ఆకుల యాదగిరి, ఆకుల సురేశ్, ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో దసరా ఉత్సవాలను ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలంతా దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాల వద్ద పలు సాంస్కృతికి కార్యక్రమాలను మహిళలు, చిన్నారులు ఆడిపాడుతూ ప్రదర్శించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, డైరీఫాం, హైదర్‌గూడ, బుద్వేల్, పద్మశాలిపురం, బాబుల్‌రెడ్డినగర్, మధుబన్‌కాలనీ, సాయిబాబానగర్, మార్కండేయనగర్‌లలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకొని సర్కిల్ పరిధిలోని ప్రజలు పెద్ద సంఖ్యలో జగన్మాత ఆలయాలకు తరలివెళ్లారు.
దుర్గామాత ఆశీస్సులను పొందాలని ఆయా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ఆలయాలకు వచ్చే భక్తుల ఆయా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయదశమి సందర్భంగా రాత్రి ఆయా ఆలయాల వద్ద రావణదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు రాజేంద్రనగర్ సర్కిల్‌కు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు హాజరై విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
విజయదశమి శుభాకాంక్షలు
విజయదశమి వేడుకలను పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు నియోజకవర్గానికి చెందిన టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయదశమి శుబాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూవిజయానికి ప్రతీకగా విజయదశమిని నిర్వహించుకుంటున్నామన్నారు. మనమంతా ఐక్యంగా ఉండి సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాకుండా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్యలు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన రావణ దహన కార్యక్రమాల్లో వారు పాల్గాన్నారు.
దసరా ఉత్సవాలను పురస్కరించుకొని గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకట్‌రెడ్డికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం మధుసూదన్‌రెడ్డి, కిషోర్‌గౌడ్, సంజయ్‌కుమార్‌లు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మర్యాదపూర్వకంగా పూలబొక్కేను అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
విజయదశమి ఉత్సవాలను పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గం తాజా మాజీ శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అమ్మవారి ఆశీస్సులతో టీఆర్‌ఎస్ ట గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
జీడిమెట్ల బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట్ గ్రామంలోని శ్రీ కనక దుర్గా ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ చెర్మన్ కొలను శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖఃసంతోషాలతో జీవించాలని, విజయ దశమి సందర్భంగా ప్రతిఒక్కరికి విజయాలు చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు మేకల వెంకటేశం, చందు ముదిరాజ్, నాయకులు కొలను నర్సింహారెడ్డి, వడ్ల నాగేశ్ చారి, అశోక్ ముదిరాజ్ పాల్గొన్నారు.
చేవెళ్ల: దసరా పండుగాను పురస్కరించుకోని చేవెళ్ల మండల కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నగరంలోని అమె నివాసంలోమాజీ మంత్రి సబితా రెడ్డిని కలిసి దసరా జమ్మిని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సబితారెడ్డికి కలిసిన వారిలో కాంగ్రెస్ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, సర్పంచ్ హన్మంత్ రెడ్డి, మండలపార్టీ ప్రదాన కార్యదర్శి మాదవ్ గౌడ్ హన్మంత్ రెడ్డి ఉన్నారు.
చేవెళ్ల : దసరా నవరాత్రి ఉత్సహల సందర్బంగా చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సం ఘనంగా నిర్వహించారు. దసరా సందర్బంగా శుక్రవారం శ్రీలక్ష్మివెంకటేశ్వర స్వామి తెపోసహం కన్నుల పండుగా జిరిగింది. స్వామి వారిని పుష్కరిణిలో నీళ్లపై ఊరేగించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దసరా రోజు రాత్రి12గంటలకు దేవాలయం నుంచి శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఊరేగింపుగా జమీ చేట్టు వద్దకు తీసుక వెళ్లి జమీ చెట్టుకు పూజ చేసిన తర్వాత గ్రామాస్తులు ప్రజలందరు ఒకరికొకరు జమీ పెట్టుకోని అలింగం చేసుకున్నారు. స్వామివారు అశ్య వాహనం పై ఊరేగుతు చేవెళ్ల గ్రామంలోనికి చేరుకుని భక్తులకు దర్శనం ఇచ్చారు. కార్యక్రమంలొ ఆలయ ఫౌడర్ చైర్మెన్ వామన చార్యులు పూజారులు మాణిక్య ప్రభు, రాఘవేంద్రచారి, కన్న, వాసు, శ్రీపాదు, నాయకులు ఉన్నారు.
శరన్నరాత్రిల ఉత్సవాల సందర్బంగా చేవెళ్ల గ్రామంలోని రచ్చబండ వద్ద నెలకొల్పిన దుర్గమాత విగ్రహం శోభయాత్ర శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కన్నుల పండుగా సాగింది. దుర్గామాత నిర్వాహకులు యాదగిరి అధ్వర్యంలో దుర్గామాత విగ్రాహంను పెద్ద లారీలో ఊరేగింపుగా నిర్వహించి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి వారి పుష్కరినీ వద్దకు ఊరేగింపుగా డప్పు వాయద్యాలతో, యువకుల డ్యాన్స్‌లు, మహిళ బతుకమ్మ ఆటపాటల మధ్య శోభయాత్ర నిర్వహించారు. సాయంత్రం పుష్కరిణీలో క్రేన్ సహయంతో దుర్గామాతను నీటిలో నిమాజ్జనం చేశారు. కార్యక్రమంలో గ్రామాస్తులు, మహిళలు, ప్రజలు, యువకులు ఉన్నారు.
వనస్థలిపురం: ఎల్బీనగర్‌లో విజయ దశిమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రజలు కొత్త బట్టలు దరించి కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఘట్‌కేసర్: ఘట్‌కేసర్‌లో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఘట్‌కేసర్, పోచారం పురపాలక సంఘాలతో పాటు పండల పరిధిలో పలు గ్రామాలలో దసరా వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆయుధ, వాహన పూజలను నిర్వహించారు.
దసరా పండుగ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు జరిపారు. నూతన వస్త్రాలను దరించి జమ్మిచెట్టుకు పూజలు జరిపి పాలపిట్టను దర్శించుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఘట్‌కేసర్, ఏదులాబాద్ గ్రామాలలో మాజీ సర్పంచ్‌లు అబ్బసాని యాదగిరి యాదవ్, మూసీ శంకర్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలాయ్, రావణ దహనం కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యువత బాణా సంచాలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
ఏదులాబాద్ గ్రామంలో బుధవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని బతుకమ్మ పండుగతో మహిళలలో ఐక్యత పెరుగుతుందని చెప్పారు. దసరా వేడుకలలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్‌లు యాదగిరి యాదవ్, మూసీ శంకర్, అయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.