రంగారెడ్డి

ఎన్నికల నిర్వహణకు బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు రక్షణ చర్యలను పోలీస్ శాఖ సహకారంతో చేపడతామని జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రంగారెడ్డి ఎన్నికల శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పోలీస్ అధికారుల, రిటర్నింగ్ అధికారుల సమావేశంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో ఎన్నికల నియమావళిని అనుసరించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ బందోబస్తు నిర్వహించాల్సిందిగా కలెక్టర్ సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, పంపిణీ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ సిబ్బంది భద్రతను కూడా చూడాలని అన్నారు. అలాగే ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ల భద్రతను ఎప్పటికప్పుడు పర్యావేక్షించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల భద్రత కోసం జిల్లా అధికార యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలను పోలీస్ శాఖకు అందజేస్తుందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా కొనసాగాలంటే పోలీస్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం పంపిణీని నియంత్రించాలని అదేవిధంగా అక్రమ డబ్బు రవాణా అరికట్టేందుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరీష్, డీఆర్‌ఓ ఉషారాణి, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్‌లు సజ్జనార్, మహేశ్ భగవత్, రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.