రంగారెడ్డి

టీఆర్‌ఎస్ రెబల్..మరొకరు స్వతంత్ర అభ్యర్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. సోమవారం మొదటిరోజు ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ల పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే.కృష్ణ కిషోర్‌కు అందజేశారు. వీరిలో ఒకరు నాచారం ప్రాంతానికి చెందిన ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్ నాయకుడు నందికొండ శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేయగా..మరొకరు స్వతంత్య్ర అభ్యర్థి ఉప్పల్ ఇందిరానగర్‌కు చెందిన రేవు చిన్న ధన్‌రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు. నందికొండ శ్రీనివాస్ రెడ్డి అధికార టీఆర్‌ఎస్ నుంచి టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. చివరికి రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగి పార్టీ నేతల్లో గుబులు రేపుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు తన అనుచరులతో హడావుడిగా ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకోవడంతో కార్యాలయం సందడిగా మారింది. ఇక్కడ ఇప్పటికే 144 సెక్షన్ అమలులో ఉండగా ఏసీపీ గోనె సందీప్, ఇన్‌స్పెక్టర్ పీ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పటిష్టమైన పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
గోషామహల్‌లో రాజాసింగ్ నామినేషన్
మెహిదీపట్నం: గోషామహల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే టీ. రాజాసింగ్ నామినేషన్ వేశారు. సోమవారం ఉదయం నియోజకవర్గం పరిధిలోని గంగాబౌలి రాణీ అవాంతి బాయి భవన్ నుంచి రాష్ట్ర బీజేపీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నామినేషన్ వేసేందుకు రాజాసింగ్ ర్యాలీలో బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి అబిడ్స్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మధ్యాహ్నం నామినేషన్ వేశారు. వీరి వెంట బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గంలో భారీ మోజారిటీతో గెలుస్తానని అన్నారు. రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగిందని, ఇప్పుడు వచ్చేది బిజేపీ ప్రభుత్వం అని అన్నారు.
మలక్‌పేట్‌లో ఆలె జితేంద్ర నామినేషన్
సైదాబాద్, నవంబర్ 12: నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు మలక్‌పేట నియోజకవర్గం నుంచి ఒక్క నామినేషన్ దాఖలయ్యింది. మలక్‌పేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా ఆలె జితేంద్ర ఒక సెట్ నామినేషన్ వేశారు. జితేంద్ర తన తల్లి గౌలిపురా కార్పొరేటర్ ఆలె లలిత, నగర మాజీ డిప్యూటి మేయర్ సుభాష్ చందర్‌జీ, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి సంరెడ్డి సురేందర్ రెడ్డితో కలిసి మలక్‌పేట ఆర్‌ఓ పడాల అశోక్‌కుమార్‌కు నామినేషన్ సమర్పించారు. బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసి పార్టీ బీ-్ఫరం మాత్రం సమర్పించలేదు. తన రెండవ సెట్ దాఖలు సమయంలో పార్టీ బీ-్ఫరం సమర్పిస్తానని జితేంద్ర తెలిపారు.
రెండు నామినేషన్ల దాఖలు
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో నామినేషన్ల దాఖలు మొదటి రోజు సోమవారం రెండు నామినేషన్ల దాఖలుతో బోణీ అయింది. జిల్లాలోని తాండూర్ నియోజకవర్గానికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజుగౌడ్, మరో స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయగా, వికారాబాద్, పరిగి, కొడంగల్‌లలో నామినేషన్లు దాఖలు కాలేదు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నలుగురు టీఆర్‌ఎస్ టికెట్ ఆశావహులు నామినేషన్ ఫారాలను తీసుకున్నారు.
మొదటి రోజు 15 నామినేషన్ ఫారాలు
నామినేషన్ దాఖలు మొదటి రోజైన సోమవారం ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఏడుగురు 15 నామినేషన్ ఫారాలు తీసుకెళ్లినట్లు వికారాబాద్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డీఆర్‌వో మోతీలాల్ వెల్లడించారు. నామినేషన్ ఫారాలు తీసుకెళ్లిన వారిలో డాక్టర్ మెతుకు ఆనంద్, చైతన్య కిరణ్, పెండ్యాల అనంతయ్య, యశ్వంత్‌రావు, గుంతల చంద్రశేఖర్, టీ.రమేష్, పటోళ్ల వరుణ్ రెడ్డి ఉన్నారని తెలిపారు. వికారాబాద్, పరిగి నియోజకవర్గాలకు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శేఖర్ వర్మ, వ్యయ పరిశీలకుడు కిషోర్, పోలీసు పరిశీలకుడు బాబులాల్ అని చెప్పారు. తాండూర్, కొడంగల్ జనరల్ అబ్జర్వర్ బిస్వరంజన్ సామెల్, వ్యయ పరిశీలకుడు సరోజ్‌కుమార్, పోలీసు పరిశీలకుడు హిమ్మత్ అభిలాష్ టక్ అని పేర్కొన్నారు. నామినేషన్ ఫారాలను కార్యాలయ సమయంలో తీసుకోవచ్చని, స్వీకరించే సమయం మాత్రం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమేనని వివరించారు. సమావేశంలో వికారాబాద్ తహశీల్దార్ చిన్నప్పల నాయుడు ఉన్నారు.
రెండు నామినేషన్‌లతో బోణీ
తాండూరు: నామినేషన్ల పర్వం లో తాండూరు అసెంబ్లీ స్థానానికి మొదటి రోజు రెండు నామినేషన్లు ధాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా నియోజకవర్గం ఇన్‌చార్జి ఎస్ సుశీల్ రాజు గౌడ్ ఒక్క సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు తాండూరు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి దశరథ్ వెల్లడించారు. అనంతరం ఇండిపెండెంట్ అభ్యర్థిగా చిలుకా గోపాల్ తన నామినేషన్ ఓక సెట్‌ను సమర్పించారు. మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పార్టీ తరపున రాజూగౌడ్ నామినేషన్ దాఖలు చేయటం, మహాకూటమి భాగస్వామ్యంలో భాగంగా తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథంలో టీడీపీ అభ్యర్థిగా రాజూ మొదటిరోజే తన నామినేషన్ వేయటం చర్చనీయాంశంగా మారింది. రెండు పర్యాయాలు తాండూరు అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన యువకుడు చిలుకా గోపాల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
బీఎల్‌ఎఫ్ అభ్యర్థి తాండ్ర నామినేషన్
శేరిలింగంపల్లి: ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ శేరిలింగంపల్లి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి టీ.వెంకన్నకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎంసీపీఐయూ అఖిల భారత కార్యదర్శి గౌస్, రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్, సీపీఎం నాయకుడు చల్లా శోభన్, మాణిక్యం, కృష్ణ, తుకారామ్ నాయక్, అనిల్ కుమార్, సుకన్య పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్
బాలాపూర్: ఎల్బీనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ తన నామినేషన్‌ను కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి వేశారు. సోమవారం ఎల్బీనగర్ మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ముంకుందరెడ్డికి అందజేశారు. ఎలాంటి ర్యాలీలు, హడవుడి లేకుండానే రామ్మోహన్ గౌడ్ తన నామినేషన్ వేశారు. మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, కందికంటి శ్రీ్ధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ప్రారంభమైన ఎన్నికల సమరం
షాద్‌నగర్: ఎన్నికల సమరం ఆరంభమైంది. డిసెంబరు 7న జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో ఎన్నికల సంగ్రామం మొదలైంది. నామినేషన్ల స్వీకరణ ఈనెల 19తో ముగుస్తుంది. 20న నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణకు చివరి గడువు 22కాగా అదే రోజు సాయంత్రం పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా వెలువడుతుంది. దీంతో రంగంలో నిలిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార హోరెత్తించనున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరు 7న పోలింగ్ జరుగనుండటంతో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు వివిధ పార్టీల నేతలు ఇప్పటికే ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, బహుజన లెఫ్ట్ ఫ్రంట్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. మహాకూటమి అభ్యర్థిని ఇంత వరకు ప్రకటించకపోవడంతో ప్రధానంగా కాంగ్రెస్ నేతలు నిరాశతో ఉన్నారు. సాయంత్రానికల్లా ప్రకటిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు.
మొదటి రోజు దాఖలు కాని నామినేషన్లు
షాద్‌నగర్: అసెంబ్లీ నామినేషన్ల స్వీకరణ మొదటి రోజైన సోమవారం నామినేషన్లు దాఖలు కాలేదు. షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్లను ఆర్డీఓ కృష్ణ స్వీకరించనున్నారు.