రంగారెడ్డి

కార్తీకమాసం పూజలు.. కిటకిటలాడిన కీసరగుట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, నవంబర్ 12: కార్తీకమాసం మొదటి సోమవారం కీసరగుట్ట భక్తులతో కిటకిట లాడింది. నగర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. యాగశాలలో కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న శివలింగాలకు భక్తులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. గుట్ట దిగువ భాగాన పార్కులో వనభోజనాలు కుటుంబ సమేతంగా భక్తులు నిర్వహించుకున్నారు. సోమవారం స్వామివారికి శుద్ధ పంచమి చెరుకు రసంతో అభిషేకం తదితర పూజాకార్యక్రమాలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు.టెండరుదార్లు టెంకాయ, పువ్వలు, కార్తీకదీపాలు అధిక ధరలకు విక్రయించటంతో భక్తుల చేసేది లేక తప్పనిసరి పరిస్ధితుల్లో కొనుగోలు చేశారు. పోలీసులు, పంచాయితీ సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేయటం వల్ల ట్రాఫిక్, పారిశుద్ధ్యంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ చైర్మన్ టీ రమేశ్ శర్మ, ఈవో నర్సింహమూర్తి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
బాలల హక్కుల వారోత్సవాలు
వికారాబాద్, నవంబర్ 12: జిల్లా మహిళా-శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలోని సమగ్ర బాలల సంరక్షణ సేవలు(ఐసీపీఎస్), విభాగం ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి జ్యోత్స్న తెలిపారు. జిల్లాలోని కస్తూర్భాగాంధీ పాఠశాలలు, బాలల సంరక్షణ గృహాల్లోని విద్యార్థులకు, చిన్నారులకు ఆటల పోటీలు, సాంస్కతిక కార్యక్రమాలు, వారి హక్కులపై అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవం రోజున జిల్లా కేంద్రంలోని ఎన్టీయార్ కూడలిలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బాలల సంరక్షణ పరిరక్షణ మనందరి బాధ్యత అంశంపై సంతకాల సేకరణ, పాఠశాల విద్యార్థులతో ర్యాలీ, వారి హక్కుల రక్షణకై ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించనున్నామని అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా బాలల కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు.