రంగారెడ్డి

ఏదులాబాద్‌లో సదర్ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, నవంబర్ 12: ఏదులాబాద్ గ్రామంలో సదర్ ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. మండల పరిధి ఏదులాబాద్ గ్రామానికి చెందిన యాదవ యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సదర్ ఉత్సవాలను తిలకించేందుకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైయస్‌ఆర్ ట్రస్టు చైర్మన్ ఏనుగు సుదర్శన్‌రెడ్డి సదర్ ఉత్సవాలను ఫ్రారంభించారు. ఎంపీటీసీ మంకం రవి పాల్గొన్నారు.
ప్రగతి కోసం ప్రభాకర్‌నే గెలిపించాలి
ఉప్పల్, నవంబర్ 12: ప్రగతి కోసం ప్రభాకర్‌ను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు ఈగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేతలు గొరిగె కృష్ణ, మంకాల లక్ష్మణ్, రావుల బాలకృష్ణ, శ్రీనివాస శర్మ, బొంగు రమేశ్, ఈగ లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి
రాష్ట్ర అధ్యక్షుడిగా మారగోని శ్రీనివాస్ గౌడ్
చార్మినార్, నవంబర్ 12: జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారగోని శ్రీనివాస్ గౌడ్‌ను నియమిస్తున్నట్లు సమితి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు కరుణాకర్ వెల్లడించారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల నుంచి వచ్చిన శ్రీనివాస్ గౌడ్‌పై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు నిబద్ధతతో తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. కో ఆర్డినేటర్ దుర్గాప్రసాద్, బహుజన సాహితీ అకాడమీ రాష్ట్ర అధ్యక్షురాలు, సామాజిక కార్యకర్త సుధారాణి పాల్గొన్నారు.
కల్వకుర్తిలో బీజేపీదే గెలుపు
ఆమనగల్లు, నవంబర్ 12: కల్వకుర్తి నియేజక వర్గంలో బీజేపీ జెండ రెపరెప లాడుతోందని బీజేపీ అభ్యర్థి టీ.ఆచారి అన్నారు. సొమవారం అమనగల్లు పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో ఆమనగల్లు పురపాలక సంఘం బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఆచారి హాజరై మాట్లాడుతూఇప్పటికి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటి చేసి ఓటమి పాలు అయ్యానని ఐదవ సారి మళ్లీ పోటీ చేస్తున్నాని ప్రజల ఆశీర్వాదించాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హరి ప్రసాద్ వైస్ ఎంపీపీ నిట్ట నారయ్య బీజేపీ నేతలు గోరేటి నర్సింహ్మ, బైకని శ్రీశైలం యాదవ్, సుండూరి శేఖర్, లక్ష్మణ్ రావు, సీహెచ్ లక్ష్మణ్, చెన్న కేశవులు, పాషా చత్రు నాయక్, పత్యానాయక్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయంలోనే గ్రామాల అభివృద్ధి
ఆమనగల్లు, నవంబర్ 12: గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం గడ్డ మీద తాండాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. రానున్న ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు. కార్యక్రమంలో కడ్తాల ఎంపీటీసీ సభ్యులు చేగూరి వెంకటేశ్, నాయకులు హీరాసింగ్, బన్సి పాండు, కిషన్, రమణ పాల్గొన్నారు.
14న తలకొండపల్లి మండల సమావేశం
తలకొండపల్లి, నవంబర్ 12: మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఈనెల 14న మధ్యాహ్నం 2గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎంపీడీవో శ్రీనివాసాచారి తెలిపారు. ఈ సమావేశాన్ని స్థానిక ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని, అధికారులు పూర్తిస్థాయి నివేదికతో సమావేశానికి హాజరుకావాలని స్థానిక ఎంపీడీవో పెర్కొన్నారు.
బీజేపీ ముమ్మర ప్రచారం
మేడ్చల్, నవంబర్ 12: మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలో బీజేపీ నాయకులు సోమవారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కొంపల్లి మోహన్‌రెడ్డికే తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. లెడ్ డిజిటల్ టీవీల ద్వారా ప్రచారం నిర్వహించి ఆకట్టుకున్నారు. ప్రభాకర్ రెడ్డి, కిషన్‌రావు, వంశీ వంజరి, సీఎం రాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు. మేడ్చల్ బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్డి సతీమణి సుజాత రెడ్డి తనయుడు ప్రవీణ్ రెడ్డి.. ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. మల్లారెడ్డి, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాఘవ రెడ్డి, అనిల్ రెడ్డి, సురేశ్ గౌడ్, ప్రేమ్‌దాస్, నాగార్జున రెడ్డి, వంశీ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, వెంకటేశ్, విక్రమ్, అనిల్, కరుణాకర్, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
వార్షిక ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి
వికారాబాద్, నవంబర్ 12: వికారాబాద్ జిల్లా పరిధిలోని సర్వీస్ పింఛన్‌దారులు, ఫ్యామిలీ పింఛనర్లు విధిగా తమ జీవన ప్రమాణ పత్రము (లైఫ్ సర్ట్ఫికెట్) సమీప మీసేవా కేంద్రంలో నమోదు చేసుకుని ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతిని ఎస్‌టీవో కార్యాలయంలో సమర్పించాలని జిల్లా ఖజానాధికారి కే.దశరథ్ తెలిపారు. వితంతు, అవివాహిత కుమార్తెలు వివాహము కాలేదని టీఎస్ గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రములతోనూ, భర్త పింఛన్ పొందుతున్న వారు (కాంపెనెంట్ అపాయింట్‌మెంట్ పొందినవారు) డీడీవోల ద్వారా ఎంప్లాయి ధ్రువీకరణ పత్రాలను 2019 మార్చిలోపు సమర్పించాలని స్పష్టం చేశారు.
ఎమ్మాఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
మేడ్చల్, నవంబర్ 12: ఎమ్మార్పీఎస్ మేడ్చల్ మండల ముఖ్యకార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సోమవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో జరిగింది. మండల సమితి అధ్యక్షుడు పరుశురామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త, అనుంబంధ సంఘాలు ఎస్సీ వర్గీకరణ దిశగా పనిచేయాలని అన్నారు. నాయకులు అశోక్, రాంచందర్, స్వామి, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆమనగల్లు లయన్స్ క్లబ్‌కు ఉత్తమ అవార్డు
ఆమనగల్లు, నవంబర్ 12: లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లుకు 2016-17 సంవత్సరానికి చేసిన సేవలకు గాను ఇంటర్ నేషనల్ నుంచి అంతర్జాతీయ ఉత్తమక్లబ్ అవార్డు దక్కింది. కండె సత్యనారాయణకు బెస్ట్ డిస్ట్రిక్ గవర్నర్‌గా మల్టీపుల్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఆమనగల్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బెస్ట్‌క్లబ్‌గా అవార్డులను అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలోనే 320ఏ జిల్లా మెదటి స్థానంలో నిలిచింది సామాజిక సేవలో అంతర్జాతీయ స్థాయిలో ఆమనగల్లు లయన్స్ క్లబ్ మెదటి స్థానంలో నిలిచిందని లయన్స్ క్లబ్ డిస్టిక్ మల్టీపుల్ చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ జీ.చెన్నకేశవ రెడ్డి డాక్టర్, వి.దామోదర్ రెడ్డి,క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎన్నమ్ హరికాంత్ రెడ్డి, కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, ట్రేజర్ పీ.వెంకట్ రెడ్డి, సభ్యులు కే.రాంమ్ రెడ్డి, జే.రమేశ్ మనోహర్, విష్ణువాస్ రెడ్డి, కేశవు పాల్గొన్నారు.