రంగారెడ్డి

టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మజ్లిస్‌కు వేసినట్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 13: టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మజ్లిస్‌కు ఓటు వేసినట్లేనని రాజేంద్రనగర్ బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్ డివిజన్ ఉప్పర్‌పల్లిలో బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు భారీ ఎత్తున దేశంలోకి చొరబడి హైదరాబాద్ పాతనగరంలో తిష్టవేశారని అన్నారు. చొరబడడమే కాకుండా దొంగ ఓట్లను నమోదు చేసుకున్నారని ఆరోపించారు. ఆ దొంగ ఓట్లతో మజ్లిస్ గెలుపొందేందుకు పావులు కదుపుతుందని మండిపడ్డారు. నగరం తీవ్రవాదులకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. మజ్లిస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవమానిస్తూ మాట్లాడినా చలనం లేదని అన్నారు. దేశంలో అవినీతి సూచీలో దేశం రెండవ స్థానంలో నిలవడమే టీఆర్‌ఎస్ పాలనకు అద్దం పడుతుందన్నారు. నామినేషన్‌ను అత్తాపూర్ నుంచి రాజేంద్రనగర్‌లోని ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రేమ్‌రాజ్, బీజేపీ నాయకులు వై.శ్రీ్ధర్, మల్లారెడ్డి, కొమరయ్య, అంజన్ కుమార్, బండి ప్రతాప్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కర్నాటక రాష్ట్ర పార్లమెంట్ కోఆర్డినేటర్ గోపినాథ్ రెడ్డి, నందకిషోర్, అడికె జనార్ధన్, మల్లేష్ యాదవ్, మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీతోనే అభివృద్ధి
ఉప్పల్: బీజేపీని గెలిపించాలి..అభివృద్ధికి సహకరించాలని తాజా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఉప్పల్ డివిజన్‌లోని శాంతినగర్, సత్యనగర్‌లో నిర్వహించిన మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కేంద్రం, రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు తెప్పించి అభివృద్ధిని చేసి చూపించానని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రభాకర్ ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు గొరిగె కృష్ణ, మంకాల లక్ష్మణ్, ఈగ శ్రీనివాస్, రేవెల్లి రాజు, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి శూన్యం
శేరిలింగంపల్లి: అధికార దాహంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి నగర అభివృద్ధిపై ముందస్తు ప్రణాళిక లేనందున చెత్త నగరంలా మారిందని శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి గజ్జల యోగానంద్ విరుచుకుపడ్డారు. మంగళవారం శేరిలింగంపల్లి డివిజన్‌లోని గోపీనగర్, నెహ్రూనగర్, అంజయ్యనగర్‌లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, డ్రైనేజీ సరిగాలేక మురికికూపంలా తయారైందని, నీటి సమస్య చాలా ఉందని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని, తనను గెలిపిస్తే వౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కృషి చేస్తానని అభ్యర్థి యోగానంద్ హామీ ఇచ్చారు. ప్రచారంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి, ఎంవీ జ్ఞానేంద్ర ప్రసాద్, బాల్ద అశోక్, రవీంద్రప్రసాద్ దూబే, చింతకింది గోవర్ధన్ గౌడ్, రమణియమ్మ, మహిపాల్ రెడ్డి, అజిత్ సేనాపతి, మారం వెంకట్ పాల్గొన్నారు.
ఆలె జితేంద్ర ముమ్మర ప్రచారం
సైదాబాద్: పాతబస్తీ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మలక్‌పేట నియోజకవర్గం అభ్యర్ధి ఆలె జితేంద్ర కోరారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలో పలు కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు.
దశబ్దాల మజ్లిస్ పాలనలో పాతబస్తీ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ప్రచారంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్‌జీ, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సంరెడ్డి సురేందర్ రెడ్డి, నర్సింహా, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్: మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని రైల్వేకాలనీ, ఉమానగర్ కాలనీలతో పాటు మండలంలోని సోమారం, ఎల్లంపేట్ గ్రామాల్లో బీజేపీ నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. కొంపల్లి మోహన్ రెడ్డికి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. నాయకులు జగన్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాగం అర్జున్, కిషన్ రావు, తిరుపతి రెడ్డి, ఉషా, వంశీ వంజరి, అవినాష్ చారి, శ్రీకాంత్, సందీప్ పాల్గొన్నారు.