రంగారెడ్డి

ఉన్నత విద్యాశాఖ మండలిని ముట్టడించిన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, నవంబర్ 13: జేఎన్‌టీయూ డిటెన్షన్ పరిమితి పెంచిన పదిశాతాన్ని ప్రభుత్వం తగ్గించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఇటీవలే జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు పది శాతాన్ని ఫీజును పెంచడాన్ని నిరసిస్తు విద్యార్ధులు మాసాబ్‌ట్యాంక్ ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యాక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ముట్టడించారు. జేఎన్‌టీయూ పరిధిలోని డిటెన్షన్ పరిమితిని 50నుంచి 60 శాతం పరిమితి పెంచడంతో సుమారు ఆరువేల మంది విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో పెంచగా ఉద్యమం నిర్వహిస్తే వేంటనే తగ్గించారని గుర్తుచేశారు. పెంచిన పరిమితని తగ్గించకపోతే జేఎన్‌టీయుకి తాళాలు వేస్తామని హెచ్చరించారు. ముట్టడి అనంతరం ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ పాపిరెడ్డితో చర్చలు జరిపారు. జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్‌తో ఫోన్లులో మాట్లాడినట్లు తెలిపారు. పెంచిన శాతాన్ని వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

వివేక్ విజయానికి ముమ్మర ప్రచారం
జీడిమెట్ల, నవంబర్ 13: కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కేపీ వివేక్‌ను గెలిపించుకునేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. గాజులరామారం సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ సంజయ్‌పురి కాలనీలో మంగళవారం కార్పొరేటర్ జగన్ ఆధ్వర్యంలో వివేక్‌ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కళాకారుల ఆటపాటలతో ఇంటింటికీ కరపత్రాలను పంచుతూ కారు గుర్తుకు ఓటు వేసి వివేక్‌ను భారీ మెజారిటీ గెలిపించాలని జగన్ అభ్యర్థించారు. జగన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే టీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జైహింద్, అంజన్ గౌడ్, మారయ్య, వేణు యాదవ్, మల్లేశ్ గౌడ్, ప్రవీన్ గుప్త, వెంకటేశ్వర రావు, రాజేశ్, రాములు, అరున్, రుద్ర అశోక్, బాలు, మహంకాళి, సాంబయ్య, హనుమయ్య, హజ్రత్ అలి, జ్యోతి, ఇందిర, లత, పాపులు, మహమూద్, మహేందర్, ఇందిరా గౌడ్, సువర్ణ పాల్గొన్నారు.