రంగారెడ్డి

నామినేషన్ల పర్వంతో వేడెక్కిన రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, నవంబర్ 13: నామినేషన్ల పర్వం మొదలు కావడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతుండటంతో రాజకీయం వేడెక్కినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్.శ్రీవర్ధన్ రెడ్డికి ఇప్పటికే అధిష్ఠానం నుంచి బీ-్ఫమ్‌లు అందాయి. ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు మంచి ముహూర్తం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 12వ తేది నుంచి 19వ తేది వరకు నామినేషన్ల గడువు ఉన్న నేపథ్యంలో మొదటిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. నవంబర్ 20న నామినేషన్ల పరిశీలన, 22వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించినట్లు ఎన్నికల అధికారులు వివరించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు నామినేషన్లు వేసేందుకు మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థితోపాటు నలుగురు వ్యక్తులను మాత్రమే కేంద్రంలోకి అనుమించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికల అధికారి నుంచి వివిధ రాజకీయ పార్టీల నాయకులు నామినేషన్ల పత్రాలను తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నేతృత్వంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్ల ఘట్టం మొదలు కావడం.. ఎన్నికల ప్రచారానికి నేతలు శ్రీకారం చుడుతున్న నేపధ్యంలో అన్ని పార్టీల్లో రాజకీయ వేడి మొదలైంది. ఏ పార్టీ అభ్యర్థిని పలకరించినా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామంటూ ఎవరికివారే తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లోని అన్ని గ్రామాల్లో మొదటి దశగా ప్రచార పర్వం పూర్తి చేశారు. రెండవ దశ ప్రచారం కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచి అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక అధికారులు దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి నేరుగా రూ.10వేల వరకు మాత్రమే నగదును ఖర్చు చేయాలి. అంతకుమించి ఖర్చు చేయాలంటే నేరుగా ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించడంతో అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ కొత్తకొత్త నిబంధనలు విధించడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని నేతలు అంటున్నారు.
రెండవ రోజు నామినేషన్లు నిల్
రెండవ రోజు నామినేషన్లు ఒక్కటి కూడా దాఖలు కాలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.కృష్ణ తెలిపారు. మంగళవారం షాద్‌నగర్ ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎం.కృష్ణ మాట్లాడుతూ మొదటి, రెండవ రోజు ఏ రాజకీయ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయలేదని వివరించారు. ఈనెల 14న మంచిరోజు ఉండటంతో నామినేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు వేసే నామినేషన్లను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పొలీస్ బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధల ప్రకారమే ఆయా పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు వివరించారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు పత్రాలను సక్రమంగా చూసుకొని దాఖలు చేసేందుకు రావాలని సూచించారు.
14న ముహూర్తం ఖరారు
షాద్‌నగర్ రూరల్: నామినేషన్లు వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ఈనెల 14వ తేదిన ముహూర్తం మంచిగా ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు నామినేషన్లు వేసేందుకు పత్రాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ నుంచి అంజయ్య యాదవ్, భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్.శ్రీవర్ధన్ రెడ్డి, ఇండిపెండెంట్‌గా వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీ.శంకర్ రావు నామినేషన్లు వేయనున్నట్లు సమాచారం. మహాకూటమి నుండి ప్రతాప్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు కార్యకర్తలు, నేతలు తెలిపారు. నామినేషన్లను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలను సమకూర్చడంలో నాయకులు బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు పార్టీలు ప్రకటించిన అభ్యర్థులతోపాటు పార్టీల నుంచి టికెట్ వస్తుందని ధీమాలో ఉన్న నేతలు స్వతంత్ర అభ్యర్థులు, నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రిటర్నింగ్ కార్యాలయం నుండి ఇప్పటికే ఆయా పార్టీల నాయకులు నామినేషన్ పత్రాలను తెచ్చుకొని సంబంధిత న్యాయవాదులతో వివరాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. నవంబర్ 14న అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్న నేపథ్యంలో షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ తమ సిబ్బందితో ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్దకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు.