రంగారెడ్డి

మేడ్చల్ జిల్లాలో 23 మంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేడ్చల్ జిల్లాలో బుధవారం 23 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేసారు. మేడ్చల్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్ధి పెద్ది మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తరఫున అతని సతీమణి విజయలక్ష్మీ, స్వతంత్ర అభ్యర్ధులుగా ఎన్. హైమవతి, కే. సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్లను కీసర ఆర్డీఒ లచ్చిరెడ్డి స్వీకరించారు. మల్కాజ్‌గిరి నుంచి ఎనిమిది, కుత్భుల్లాపూర్ నుంచి రెండు, కూకట్‌పల్లి నుంచి ఒకటి, ఉప్పల్ నుంచి ఎనిమిది నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు.
రెండు దాఖలు
చేవెళ్ల: చేవెళ్లలో రెండు నామినేషన్లు దాఖలైనట్లు చేవెళ్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి హన్మంత్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో కాంగ్రెస్ నుంచి కేఎస్ రత్నం తరఫున అతని కుమారుడు ప్రమోద్, రెబల్ అభ్యర్థిగా వెంకట స్వామి వేసినట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. నామినేషన్ కార్యాలయం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఒకే ఒక్కరు
మెహిదీపట్నం: కార్వాన్ నియోజకవర్గంలో ఒకే నామినేషన్ వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యలత తెలిపారు. బుధవారం టీఆర్‌ఎస్ అభ్యర్ధి టీ.జీవన్ సింగ్ గోల్కొండ మండల తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. జీవన్‌సింగ్ రెండు సెట్లు నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఇప్పటివరకు జీవన్‌సింగ్ మాత్రమే రెండు నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
బుధవారం కార్వాన్ తాళ్లగడ్డలోని తన నివాసం నుంచి బయలుదేరి కార్యకర్తలతో లంగర్‌హౌస్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చారు. అక్కడి నుంచి కేవలం ఐదుగురు మాత్రమే గోల్కొండ మండల తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్‌ను అందించారు. జీవన్‌సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అన్నారు.
నాంపల్లి నియోజకవర్గంలో కూడా ఒకే ఒక్క నామినేషన్ వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి అనురాధ తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి అనంద్ కుమార్ గౌడ్ తరఫున కుటుంబ సభ్యులు ఆసీఫ్‌నగర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేసినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. నామినేషన్ల పర్వంలో మూడవ రోజున ఒకే ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేసినట్లు చెప్పారు.
మహేశ్వరం: మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ల మూడవ రోజు ఒక్క నామినేషన్ దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సబితా ఇంద్రారెడ్డి తరుపున పార్టీ నాయకులు నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరుపున నామినేషన్ దాఖలు చేసిన వారిలో పార్టీ నాయకులు కే.రఘుమా రెడ్డి, ఎం.శివమూర్తి, షేక్ అబుబాకర్, ఇజ్రాయిల్ ఉన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు జయగణేష్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని ఎవరైన వ్యతిరేకించుతే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తలసాని నామినేషన్ దాఖలు
సనత్‌నగర్: సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. బీకే గూడా జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకొని టీఆర్‌ఎస్ తరఫున నామినేషన్ పత్రాలను సమర్పించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని అన్నారు. సుమిత్ర, శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థులుగా తమ నామినేషన్‌లు దాఖలు చేశారు.
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానానికి మూడు నామినేషన్‌లు బుధవారానికి దాఖలయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం మొదటిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండవ రోజు మంగళవారం ఆలిండియా సమతా పార్టీ తరఫున సిద్ధేశ్వర్ నామినేషన్ వేశారు. బుధవారం కాంగ్రెస్ తరఫున కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, స్వతంత్ర అభ్యర్థి గరిగె అశ్విన్ కుమార్ నామినేషన్‌ను వేశారు. ఈనెల 19న గాజులరామారం శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీతో శ్రీశైలం గౌడ్ మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అధికారికంగా నామినేషన్‌ను దాఖలు చేస్తారు.
ప్రధాన అభ్యర్థులు..
షాద్‌నగర్: ముందస్తు ఎన్నికల్లో భాగంగా మూడవ రోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. బుధవారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.శ్రీవర్ధన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి వీర్లపల్లి శంకర్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా టీఆర్‌ఎస్, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థి మొదటి సెట్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.కృష్ణకు అందజేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థుల వెంట ఉన్న ముఖ్య అనుచరులను లోపలికి పోలీసులు అనుమతించకపోవడంతో కొద్దిసేపు పోలీసులు, నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం నుంచి సిబ్బంది వచ్చి పోలీసులకు నచ్చజెప్పడంతో లోపలికి అనుమతించారు. షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉన్న జయశంకర్ విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఒక్కసారిగా అభ్యర్థుల మద్దతు దారులు రావడంతో రోడ్డుకు ఇరువైపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడవ రోజు నామినేషన్ల దాఖలు ప్రశాంతంగా ముగిశాయి.
టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎల్గనమోని అంజయ్య యాదవ్ వెంట మాజీ ఎమ్మెల్యే ఇందిర, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, సీనియర్ నేత రామకృష్ణా రెడ్డితోపాటు మరోవ్యక్తి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎన్.శ్రీవర్ధన్ రెడ్డి వెంట బీదర్ ఎంపీ భగవంతు ఖుభా, నేతలు కమ్మరి భూపాలచారి, దేపల్లి అశోక్ గౌడ్, పాతపల్లి కృష్ణారెడ్డి ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి వీర్లపల్లి శంకర్ వెంట నేతలు మంగులాల్ నాయక్, మిట్టు నాయక్, మల్లేష్, విఠల్ ముదిరాజ్, కొమ్ముకృష్ణ ఉన్నారు