రంగారెడ్డి

దర్గాలో డిప్యూటీ సీఎం ప్రార్థనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, నవంబర్ 15: జహంగీర్‌పీర్ దర్గాలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురువారం కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ పంచాయతీ జహంగీర్‌పీర్ దర్గాలో బాబాకు ఛాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇన్ముల్‌నర్వలో టీఆర్‌ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి షాద్‌నగర్ పట్టణంలోని షాహి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మైనారిటీల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో షాద్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎల్గనమోని అంజయ్య యాదవ్, మహబూబ్‌నగర్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.
రవి ఫుడ్స్‌లో ఐటీ సోదాలు
రాజేంద్రనగర్, నవంబర్ 15: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో ఉన్న రవి ఫుడ్స్ కంపెనీలో గురువారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్‌కు చెందిన ఆస్థులు, వ్యాపారాలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉన్న సంస్థలో సోదాలు చేపట్టిన అధికారులు తాజాగా హైదరాబాద్‌లో ఉన్న ఆస్థుల లెక్కలను తేల్చే పనిలో పడ్డారు. అందులో భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ కాటేదాన్‌లో ఉన్న డ్యూక్స్ బిస్కెట్ల కంపెనీతో పాటు స్థిరాస్తి కార్యాలయాలను తనిఖీలు చేశారు. ఉదయం 20 బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయి. దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్ ఉప్పల్ నుంచి మహాకూటమి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇటివలే నామినేషన్ వేశారు. నేపథ్యంలోనే ఐటీ సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది.