రంగారెడ్డి

కాంగ్రెస్‌కు కార్తీక్ రెడ్డి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, నవంబర్ 16: సీట్ల పంచాయతీ కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. మాజీ హోంమంత్రి సబితారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డికి రాజేంద్రనగర్ టికెట్ కాంగ్రెస్‌కు కేటాయింకపోవడంతో ఆగ్రహానికి గురై శంషాబాద్‌లోని బేగం ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సమావేశంలో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మహా కూటమి పేరుతో కేసీఆర్‌తో టీడీపీ నేత ఎల్.రమణ కుమ్మక్కై టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. రాజీనామాను ఆమోదిస్తారా లేక టికెట్ ఇస్తారా అంటు ఉత్తమ్ కుమార్‌ను డిమాండ్ చేశాడు. త్వరలోనే నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలందరూ పార్టీకి రాజీనామా చేస్తారన్నారు. రాజీనామా చేసిన వారిలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, జడ్పీటీసీ సతీష్ ఉన్నారు. సమావేశం నుంచి ర్యాలీగా వెళ్లి పార్టీ కార్యాలయం వద్ద జెండాలను చించేసి, పార్టీ దిమ్మెలను ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని కార్తీక్ రెడ్డి అన్నారు. రెబల్‌గా నామినేషన్ వేస్తానని తెలిపారు. టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శిష్యుడు గణేష్ గుప్తాకు మహాకూటమి టీడీపీ టికెట్‌ను కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్‌ను ఎంతకు అమ్మారో చెప్పాలని ఘాటుగా విమర్శించారు.