రంగారెడ్డి

శ్రీవారి కార్తీకమాస జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 17: అనంతగిరి శ్రీ అనంతపద్మనాభస్వామి శ్రీవారి కార్తీకమాస జాతర ఉత్సవాలు ఈనెల 18 నుంచి డిసెంబర్ రెండో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి, ఫౌండర్ ట్రస్టీ జీ.శేఖర్ గౌడ్, నాళాపురం సీతారామచార్యులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ధ్వజారోహణం-పుణ్యాహవాచనం, 19న కార్తీక ఏకాదశి, 20న సాయంత్రం 7.11 గంటలకు తులసీ వివాహం, 23న సాయంత్రం 4.30 గంటలకు స్వామి వారి కళ్యాణోత్సవం, 9.30 గంటలకు రథోత్సవం, 24న ఉదయం 11 గంటలకు ముత్యాల పందిరి ఉత్సవం, 25న ఉదయం 11 గంటలకు గరుడ వాహనసేవ, 26న గజ వాహనోత్సవం, డిసెంబర్ 11 గంటలకు చక్రతీర్థంతో స్వామి వారి ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు.
సమాజ సేవలో విద్యార్థులు
షాద్‌నగర్ రూరల్, నవంబర్ 17: విద్యతోపాటు సమాజ సేవలో విద్యార్థులు పాల్గొనాలని వివేకానంద విద్యాసంస్థల కార్యదర్శి శ్రీవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం షాద్‌నగర్ పురపాలక సంఘం చటాన్‌పల్లి వివేకానంద ఇంజనీరింగ్ కళాశాలలో బీఇడీ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికారు. విద్యార్థులు విద్యతోపాటు సమాజ సేవలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో వివేకానంద విద్యాసంస్థల డైరెక్టర్లు విజయ్‌కుమార్, సత్యనారాయణ, లింగారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారెడ్డి, అధ్యాపకుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ గెలుపునకు యువత సైనికుల్లా పనిచేయాలి
జీడిమెట్ల, నవంబర్ 17: టీఆర్‌ఎస్ గెలుపు కోసం యువత సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ నియోదకవర్గం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్ అన్నారు. జీడిమెట్లలోని సరోజిని గార్డెన్‌లో రైజ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో వందలాది సంఖ్యలో యువకులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రంగారెడ్డి నగర్ డివిజన్ ఎన్‌ఆర్ ప్యాలెస్‌లో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వివేక్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. రాజు, వివేక్‌లు వారికి టీఆర్‌ఎస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్, నాయకులు సాయి, తరున్, చైతన్య, నిఖిల్, విక్రమ్, కేపీ విశాల్, నాగరాజు, జయరామ్, కవిత, పద్మ, శ్రీదేవి, నగేశ్, మాధవరెడ్డి, బాల్‌రాజ్, సుధాకర్, అబ్దుల్ ఖాదర్, రహీమ్, చిన్న, నర్సింగరావు, దాస్, శంకర్, కమ్రుద్దీన్, శ్రీనివాస్, వెంకటేశ్, అయూబ్, మాజిద్, అతీఫ్, రషీద్, షకీల్, జలీల్, సిద్ధిక్, ఫెరోజ్, అన్వర్, సల్మాన్ పాల్గొన్నారు.
సూరారం డివిజన్ లో..
సూరారం డివిజన్ న్యూ షాపూర్‌నగర్, మార్కెట్, హెచ్‌ఎంటీ సొసైటీ తదితర కాలనీలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్‌ను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ రాజు, కార్పొరేటర్ సత్యనారాయణలు ముమ్మర ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్ పాల్గొన్నారు.