రంగారెడ్డి

చెరువులను పరిరక్షిస్తేనే మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, నవంబర్ 17: ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలను పరిష్కారం చేస్తామన్న హమీ ఇవ్వడంతో పాటు, పీపుల్స్ మేనిఫెస్టో ప్రకటించిన డిమాండ్లను నేరవేర్చే పార్టీలకు తమ ఓట్లు వేయాలని తీర్మానం చేసినట్లు ‘చెరువుల పరిరక్షణ సమితి’ సభ్యులు పేర్కొన్నారు. శనివారం మీర్‌పేట్‌లో ‘చెరువుల పరిరక్షణ సమితి’ కమిటీ సభ్యులు పీపుల్స్ మేనిఫెస్టో విడుదల చేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ బాలాపూర్ మండలం మీర్‌పేట్, జిల్లెలగూడ, బడంగ్‌పేట్ మున్సిపాలిటిల పరిధిలో గల పెద్ద, మంత్రాల, సంద చెరువులలో మురుగు నీరు చేరి, మురికి కూపాలుగా మారాయని అన్నారు. ట్రంక్ లైన్ నిర్మాణంతో పాటు మూడు చెరువుల సమీపాన పార్కులు నిర్మించాలని అన్నారు. అదే విధంగా ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దొపిడీని నివారించడంతో పాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు నిర్మించాలని కోరారు. అదే విధంగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పనిపరిగా వినియోగించుకోవాలని విన్నవించారు.
మేడ్చల్ మండలంలో బీజేపీ బైక్ ర్యాలీ
మేడ్చల్, నవంబర్ 17: మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, గౌడవెల్లి, రాయిలాపూర్, బండమాదారం, శ్రీరంగవరం, నూతల్‌కల్, తదితర గ్రామాల్లో శనివారం బీజేపీ అభ్యర్థి కొంపల్లి మోహన్ రెడ్డి కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థి మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అమరం మోహన్ రెడ్డి, విక్రం రెడ్డి, జగన్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, పోచయ్య, శ్రీనాథ్ రెడ్డి, విజయలక్ష్మీ, గణేశ్, లావణ్య, కృష్ణ, హంసలేఖ పాల్గొన్నారు.
మల్లారెడ్డిని గెలిపించి సత్తా చాటుతాం
ఘట్‌కేసర్, నవంబర్ 17: మేడ్చల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిని భారి మెజారిటీతో గెలిపించి ఘట్‌కేసర్ మండల సత్తా చాటుతామని మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలో కొండాపూర్, అవుషాపూర్, అంకుషాపూర్, మాధారం, మర్పల్లిగూడ, ఘనపూర్, వెంకటాపూర్, కొర్రెముల, యంనంపేట్, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ గ్రామాలలో శనివారం టీఆర్‌ఎస్ కార్యాలయాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గొంగళ్ల స్వామి, మాజీ చైర్మన్ డొంకెని బిక్షపతిగౌడ్, డైరక్టర్లు కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బైనగారి నాగరాజు, కీసరగుట్ట ఆలయ కమిటీ డైరక్టర్ తరిణే మహింధ్రాచారి, ఏంపీటీసీ జంపాల రమేశ్ పాల్గొన్నారు.