రంగారెడ్డి

శేరిలింగంపల్లి ప్రజా కూటమిలో ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, నవంబర్ 17: ప్రజా కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద పట్టుకుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం టికెట్ టీడీపీకి కేటాయించడంతో ఆగ్రహానికి గురైన పీసీసీ మాజీ సంయుక్త కార్యదర్శి, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే మారబోయిన భిక్షపతి యాదవ్ అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. వారం రోజులపాటు కార్యకర్తలతో సమాలోచనలు చేసిన బిక్షపతి ఎట్టకేలకు రెబల్‌గా బరిలో దిగాలని నిశ్చయించుకున్నాడు. శనివారం భారీ ర్యాలీతో బయలుదేరి అట్టహాసంగా నామినేషన్ వేశారు. నామినేషన్ ర్యాలీలో మున్సిపల్ మాజీ చైర్మన్ మాదారం నర్సింగరావు, మాజీ ఫ్లోర్ లీడర్ కట్ల రఘుపతి రెడ్డి, సీనియర్ నాయకులు గంగల నర్సింహా యాదవ్, ఎస్.శ్రీనివాస్ గౌడ్, వీబీ అనంత రెడ్డి, మహిపాల్ యాదవ్, రమేశ్, పద్మ, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఆనంద ప్రసాద్ నామినేషన్
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజా కూటమి తరపున టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల ఆనంద ప్రసాద్ శనివారం ఒకసెట్ నామినేషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్ 20 డిప్యూటీ కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి టీ.వెంకన్నకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. మాజీ కార్పొరేటర్ భానుప్రసాద్, సినీ ప్రముఖుడు అనే్న రవి, నాయకులు ఉన్నారు.
కాంగ్రెస్ నేత భిక్షపతి నామినేషన్
పీసీసీ మాజీ సంయుక్త కార్యదర్శి, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే మారబోయిన భిక్షపతి యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో కూటమిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శేరిలింగంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మాదారం నర్సింగరావు, మాజీ ఫ్లోర్ లీడర్ కట్ల రఘుపతి రెడ్డిలతో కలిసి భిక్షపతి యాదవ్ నామినేషన్ వేశారు. తన గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ రెబెల్‌గా మొవ్వా నామినేషన్
ప్రజా కూటమి తరపున సీటు దక్కించుకున్న టీడీపీ నుంచి రెబెల్‌గా మొవ్వా సత్యనారాయణ తన నామినేషన్ వేశారు. నాయకులు ఉరిటి వెంకట్రావు, మనే్నపల్లి సాంబశివరావులతో కలిసి రిటర్నింగ్ అధికారి వెంకన్నకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అధిష్టానం హామీ ఇచ్చి కొత్త వ్యక్తికి సీటు కట్టబెట్టిందని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుణపాఠం చెప్పుతానని హెచ్చరించారు.
బీజేపీ అభ్యర్థి యోగానంద్ నామినేషన్
బీజేపీ శేరిలింగంపల్లి అభ్యర్థి గజ్జల యోగానంద్ భారీ ర్యాలీతో తరలివచ్చి నామినేషన్ వేశారు. హైదర్‌నగర్ అమ్మవారి ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో మియాపూర్, చందానగర్, లింగంపల్లి ద్వారా ఇక్కడికి చేరుకున్నారు.
శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు భీమ్‌రావు, బాల్ద అశోక్‌లతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఎం.జ్ఞానరాజు, బీర శ్రీనివాస రావు, పీ.రాములు, రవిందర్ ఉప్పల మహ్మద్ ఖాలేద్ నామినేషన్ వేశారు.