రంగారెడ్డి

ప్రజా సంక్షేమం కోరేది కాంగ్రెస్సే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 18: కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు ప్రజా సంక్షేమాన్ని కోరతారని వికారాబాద్ మహాకూటమి అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజలు కాంగ్రెస్‌కి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థులు, రైతులు, యువకులు, మహిళలు, ఉపాధ్యాయులను మోసం చేసిందని విమర్శించారు. తనను గెలిపిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రిని అవుతానని, గతంలో ఆరేళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. శాటిలైట్ టౌన్‌షిప్‌లో భాగంగా అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 3200 కోట్ల రూపాయలను మంజూరు చేయగా, రూ.200 కోట్లతో కేవలం మంజీరా నీటి పథకం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని చేపట్టామని మిగతా నిధులను తేవడంలో సీఎం, మంత్రి, ఇక్కడి ఎమ్మెల్యేలు విఫలమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వీ.సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు చంద్రశేఖర్ రెడ్డి, మధుకర్, నాయకులు దోమ శ్రీ్ధర్, బాదాం అశోక్, కృష్ణా రెడ్డి, దొడ్ల బుచ్చయ్య, మాజీ కౌన్సిలర్లు బుచ్చిబాబు గౌడ్, ఎం.రామస్వామి, మల్లికార్జున్, ప్రభాకర్ రెడ్డి, సురేష్, రామకృష్ణ రెడ్డి, ఉస్మాన్, వెంకట్ రెడ్డి, సుభాన్ రెడ్డి, ప్రవీణ్, వరుణ్, శ్రీనివాస్ ముదిరాజ్, షరీఫ్, అథిక్, రహీం, రాకేశ్, కిశోర్, వెంకటేశ్, శంకర్ పాల్గొన్నారు.

వికారాబాద్‌లో బీజేపీ విజయం ఖాయం
వికారాబాద్, నవంబర్ 18: వికారాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయం ఖాయమని బీజేపీ అభ్యర్థి సాయికృష్ణ ధీమా వ్యక్తం చేశారు. మోమిన్‌పేట మండలం బుర్గుపల్లి గ్రామానికి చెందిన 28 మంది యువకులు సాయికృష్ణ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీపని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మజ్దూర్ సెల్ జిల్లా కన్వీనర్ ప్యాట శంకర్, న్యాయవాది పరమేశ్వర్ పాల్గొన్నారు.
మేడ్చల్: మండలంలోని రాజబొల్లారం గ్రామంలో ఆదివారం బీజేపీ అభ్యర్థి కొంపల్లి మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీకి చెందిన వంద మంది కార్యకర్తలు మోహన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. పట్టణంలోని బాలాజీనగర్‌లో నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అమరం మోహన్ రెడ్డి, జగన్ గౌడ్, వెంకటేశ్, నాగరాజు, సత్తిబాబు, నాగార్జున్, లక్ష్మీనారాయణ, ప్రభాకర్ రెడ్డి, కిషన్‌రావు, వంశీ వంజరి, సీఎం రాజు, సర్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
మల్కాజిగిరి: తనకు ఒక్క అవకాశం ఇస్తే బంగారు మల్కాజిగిరిగా తీర్చి దిద్దుతానని బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఆదివారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని గౌతంనగర్ డివిజన్ మధుసూదన్ నగర్, సంతోష్ నగర్, సాయినగర్, భవానినగర్, వాణినగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీ.రాంబాబు, డీఎన్ వెంకటేష్, ప్రియతం రామకృష్ణ, శ్రీనివాస్ ముదిరాజ్, రాందాస్ ధన్‌రాజ్, ప్రభు గుప్త పాల్గొన్నారు.