రంగారెడ్డి

ప్రజా కూటమితోనే తెలంగాణ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమట్ల, నవంబర్ 18: ప్రజా కూటమితోనే తెలంగాణ ప్రజల అభివృద్ధి సాధ్యమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని బౌరంపేట్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్, వైస్సార్ సీపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. గ్రామ మాజీ ఉప సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, నర్సారెడ్డి బాల్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గాజులరామారం డివిజన్ బాలయ్య నగర్‌లో గంగారం ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కూన శ్రీశైలం గౌడ్ గెలవాలని కోరుతూ పాస్టర్‌లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ రజితరత్నం మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూనకు మద్దతు తెలిపారు. నిజాంపేట్ గ్రామం, ప్రశాంతి హిల్స్‌కు చెందిన టీడీపీ నాయకులు అబ్బూరి శేఖర్, నాయుడు కూన శ్రీశైలం గౌడ్‌కు మద్దతు తెలుపుతూ నామినేషన్ వేసేందుకు రూ.10116 విరాళాన్ని కూన అందజేశారు. హెచ్‌ఎంటీ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన శెట్టి బలిజ, 26 కులాల వనబోజన కార్యక్రమంలో కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. 26 కులాలను బీసీ జాబితా నుంచి టీఆర్‌ఎస్ తొలగించిందని, కాంగ్రెస్ మహాకూటమి గెలుపొందితే తిరిగి బీసీ జాబితాలో 26 కులాలను చేర్చుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బాను, హరికృష్ణ, రవి, దిలీప్, శ్రీనివాస్ రెడ్డి, బాల్‌రెడ్డి, మనె్న కుమార్, ప్రభాకర్, రాజు, ప్రేమ్‌కుమార్, వెంకట్, మల్లేశం, నరేశ్, నాగరాజు, గోపి, శ్యామ్ పాల్గొన్నారు.

బీసీ కులాలంతా ఏకం కావాలి: ఆర్.కృష్ణయ్య

జీడిమెట్ల, నవంబర్ 18: బీసీ కులసంఘాలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, షాపూర్‌నగర్ హెచ్‌ఎంటీ ఆఫీసర్స్ క్లబ్‌లో 26 బీసీ కులాల జేఏసీ సమావేశం జరిగింది. శెట్టిబలిజల కార్తీక మాస వనభోజన కార్యక్రమం జరిగింది. హెచ్‌ఎంటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో కళింగ కులస్థుల కార్తీక మాస వనబోజన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య, సినీ హిరో సుమన్ వేర్వేరుగా విచ్చేశారు. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ కుల సంఘాలంతా ఏకతాటిపైకి రావాలని, సమాన హక్కు వచ్చే వరకు పోరాడాలని అన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని చెప్పారు. సుమన్ మాట్లాడుతూ అన్ని కులాలను గౌరవించాలని, తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవిస్తారో కులాన్ని గౌరవించుకోవాలని అన్నారు. శెట్టిబలిజలు ఇతర బీసీ కులాలు అన్ని రంగాల్లో ఎదగాలని, విద్యాపరంగా ఎదగాలని సూచించారు.