రంగారెడ్డి

కాంగ్రెస్‌తోనే మైనారిటీల సంక్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, నవంబర్ 18 : కాంగ్రెస్‌తోనే మైనారిటీల సంక్షేమం, అభివృధ్ది సాధ్యమని ఎల్బీనగర్ ప్రజాకూటమి అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీనగర్ చింతలకుం పల్లవి గార్డెన్‌లో ఆదివారం మైనార్టిసెల్ చైర్మన్ అప్సర్‌బాయ్ ఆధ్వర్యంలో జసన్‌ఈమిలాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మైనారిటీలకు రుణాలు అందిస్తామని, రిజర్వేషన్ కల్పిస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనారిటీలకు రుణాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సయ్యద్ అత్తర్, దహల్వి, షేక్ అబ్దుల్లా, అజీమ్‌ఖాన్, షాన్‌వాజ్, మతిన్ పాల్గొన్నారు.

నామినేషన్లకు ఆఖరు నేడే

ఇబ్రహీంపట్నం, నవంబర్ 18: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీల నేతలతో పాటు, ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇబ్రహీంపట్నంలో ఇప్పటి వరకు మొత్తం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. భారతీయ జనతా పార్టీ 2, తెలుగుదేశం పార్టీ 3, కాంగ్రెస్ 2, టీఆర్‌ఎస్ నుంచి ఒకటి, ఇండిపెండెంట్, ఇతరులు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగుతున్న మహాకూటమి పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్, టీజెఎస్, సీపీఐ పార్టీల్లో రెబల్స్ పోటీకి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగ పడ్డ రొక్కం భీంరెడ్డి, కాంగ్రెస్ నుంచి క్యామ మల్లేశ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, టీఆర్‌ఎస్ నుండి అసమ్మతి వర్గం, బీజేపీ నుంచి సీనియర్ నాయకులు రెబెల్స్‌గా నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి క్యామ మల్లేశ్, మల్‌రెడ్డి రంగారెడ్డిలు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. కచ్చితంగా రెబెల్స్‌గా బరిలో నిలిచేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రధాన పార్టీలకు రెబెల్స్ బెడద బాధిస్తోంది. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయిన నాటి నుంచి ఇబ్రహీంపట్నం స్థానానికి నానాటికి ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది. అనూహ్య పరిణామాలు చోటుచేసుకొని కొత్త పేర్లు తెరమీదకి రావడం, టికెట్ ఆశించిన సీనియర్లకు భంగపాటు తప్పకపోవడం అసెంబ్లీ సెగ్మెంట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
నామినేషన్ దాఖలు చేయనున్న
మంచిరెడ్డి, అశోక్ గౌడ్
స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మరోసారి తన కుటుంబ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే సోమవారం మరో మారు కార్యకర్తలతో సమావేశమయ్యి బీ-్ఫమ్‌తో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న మంచిరెడ్డి నామినేషన్ దాఖలు చేసి ప్రచారానికి మరింత ఊపుతీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొత్త అశోక్ గౌడ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి మర్పల్లి అంజయ్య యాదవ్, రణధీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, కొత్త అశోక్‌గౌడ్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మహాకూటమి నుండి తెలుగుదేశం అభ్యర్థిగా సామ రంగారెడ్డి కుటుంబ సభ్యులు నామినేషన్ దాఖలు చేయగా, అతను కూడా బీ-్ఫమ్‌తో మరో మారు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి క్యామ మల్లేశ్ నామినేషన్ దాఖలు చేశారు. మరో నేత మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. బీఎల్‌ఎఫ్ నుంచి టికెట్ దక్కించుకున్న సీపీఎం అభ్యర్థి పగడాల యాదయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరితో పాటు రాజకీయ పార్టీల నాయకులు బరిలో నిలవనున్నారు.