రంగారెడ్డి

నామినేషన్ల ఆఖరి రోజున కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 19: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సుమారు 29 మంది అభ్యర్థులు తమ నామినేషన్‌లను అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా అధికారులు నిర్ధారించారు.
భారీ ర్యాలీగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్ నియోజకవర్గం తాజా మాజీ శాసనసభ్యులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ సోమవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీడీపీ నేత గణేష్‌గుప్తకు
మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి
సోమవారం నామినేషన్ వేసేందుకు చివరి రోజు కావడంతో గణేష్‌గుప్త మహాకూటమి నాయకులతో కలసి వేశారు. భారీ ర్యాలీ నిర్వహిస్తూ నామినేషన్ వేసేందుకు తరలివెళ్లారు. కాంగ్రెస్ యువ నాయకులు కార్తీక్‌రెడ్డి ఆయన మద్దతును గణేష్‌గుప్తకు తెలియజేశారు. కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా మహాకూటమికే ఉందని అన్నారు. అందుకే తమ పూర్తి మద్దతును మహాకూటమి అభ్యర్థికి అందిస్తామని పేర్కొన్నారు. గణేష్‌గుప్త తన నామినేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందజేశారు.
భారీ బందోబస్తు
రాజేంద్రనగర్ నియోకవర్గంలో నామినేషన్లకు ఆఖరు రోజు కావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్లను స్వీకరిస్తున్న ఆర్డీవో కార్యాలయం సమీపంలో సుమారు 100 మీటర్ల దూరం వరకే రాకపోకలను నిలిపివేశారు.
రాజేంద్రనగర్‌లో 29 నామినేషన్లు
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నామినేషన్ల గడువు ప్రారంభమై ముగిసే నాటికి సుమారు 29 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేసినట్లు రాజేంద్రనగర్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.