రంగారెడ్డి

మహా కూటమిదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్: మహా కూటమి అధికారంలోకి రాబోతుందని హోంశాఖ మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ అన్నారు. కూటమి బలపర్చిన టీడీపీ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి టీ.వీరేందర్ గౌడ్ సోమవారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. హబ్సిగూడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు నిర్వహించారు. సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఇందిర గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ అవినీతి తప్ప అభివృద్ధి లేదని ధ్వజమెత్తారు. టీడీపీ అభ్యర్థి వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ కూటమి బలపర్చిన అభ్యర్థి వీరేందర్ గౌడ్ విజయానికి సైనికుడిలా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్, సీపీఐ ఇన్‌చార్జి జానీ, మహిళా నాయకురాలు మాచర్ల ప్రతిభ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐదువేల మంది పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే.కృష్ణ శేఖర్‌కు బీ-్ఫరమ్‌తో నామినేషన్ పత్రాలను అందజేశారు.
ప్రత్యేక ఆకర్షణగా డూప్ ఎన్టీఆర్
టీడీపీ ర్యాలీలో డూప్ ఎన్టీఆర్ వేషంతో రాము అనే వ్యక్తి తమ నటనతో ప్రత్యేక ఆకర్షణీంగా నిలిచారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు, అభిమానులతో సోమవారం ఉప్పల్ రింగ్‌రోడ్డులో సందడి చేశారు. చివరి రోజు సోమవారం 23 మంది నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ నుంచి ఆకుల రమేశ్, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ నుంచి బద్దిటి రాజు, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బేతి సుభాష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి తూళ్ల వీరేందర్ గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రియాంక మార్తినేని, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ నుంచి వరికుప్పల కృష్ణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి వాకిటి రఘునందన్ రెడ్డి, నవ సమాజ్ పార్టీ నుంచి శశిధర్ పెండెం, బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎడ్ల పరమేశ్వర్, తెలంగాణ కమ్యూనిస్టు ఆఫ్ ఇండియా నుంచి పిట్ల మహేశ్వర్, ఆల్ ఇండియా సమతా పార్టీ నుంచి కే.ప్రకాష్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్టు), క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నుంచి మత్తయి పెరుక, బహుజన రాజ్యం పార్టీ నుంచి శ్రీనాథ కృష్ణ, స్వతంత్య్ర అభ్యర్థులుగా భారత సుదర్శన్, మేకల శివా రెడ్డి, నందికొండ శ్రీనివాస్ రెడ్డి, రేవు చిన్న ధన్‌రాజ్, క్రాంతి కిషోర్ తమ మద్దతుదారులతో వచ్చి నామినేషన్ పత్రాలను అందజేశారు.