రంగారెడ్డి

నామినేషన్ల సందడే సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, నవంబర్ 19: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం నామినేషన్ల పర్వం ముగిసింది. కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయానికి అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ర్యాలీలతో నామినేషన్‌లను దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద్ సూరారం కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి జీడిమెట్ల, షాపూర్‌నగర్ మీదుగా వందలాది ద్విచక్ర వాహనాల ర్యాలీతో కుత్బుల్లాపూర్ మున్సిపల్‌కు చేరుకున్నారు. మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గాజులరామారంలోని చిత్తారమ్మ దేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆ తరువాత స్థానిక దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి రోడామిస్ర్తినగర్, షాపూర్‌నగర్ మీదుగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ వరకు వందలాది బైక్‌లతో ర్యాలీగా చేరుకున్నారు. కూన శ్రీశైలం గౌడ్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి విక్టర్‌కు అందజేసి బయటికి వచ్చిన తరువాత టీఆర్‌ఎస్ కార్యకర్తలు ర్యాలీతో మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చారు. మహాకూటమి, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇరువురుగా ఎదురవడంతో పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. కాసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం రీతిలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను పంపించారు. ఆ తరువాత టీఆర్‌ఎస్ అభ్యర్థి కేపీ వివేక్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
ప్రజల ఆశీర్వాదంతోనే గెలుపు
* టీఆర్‌ఎస్ అభ్యర్థి కేపీ వివేక్
ప్రజల ఆశీర్వాదం టీఆర్‌ఎస్ పైన ఉందని, భారీ ర్యాలీనే గెలుపునకు నిదర్శనమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేక్ ధీమా వ్యక్తం చేశారు. సూరారం కట్టమైసమ్మ ఆలయం నుంచి ఎమ్మెల్సీ రాజుతో కలిసి భారీ ర్యాలీతో నామినేషన్‌ను వేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికీ చేరిందని, కేసీఆర్ పాలనపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. కార్యక్రమంలో తెరాస నేత కేఎం ప్రతాప్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
గాజులరామారం సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ జగన్ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా సూరారం కట్టమైసమ్మకు తరలివెళ్లారు. ముందుగా జగన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బైక్ ర్యాలీతో షాపూర్‌నగర్‌కు చేరుకున్నారు. జగద్గిరిగుట్ట నుండి షాపూర్‌నగర్ వరకు హెచ్‌ఎంటీ రోడ్డంతా టీఆర్‌ఎస్ కార్యకర్తల ర్యాలీ కిలోమీటరు పొడవునా ఉండడం విశేషం. బాచుపల్లి గ్రామంలో భారీ సంఖ్యలో వాహనాలతో సూరారం కట్టమైసమ్మకు సర్పంచ్ ఆగం పాండు, ముదిరాజ్ సంఘం నాయకుడు ఆగం రాజు ఆధ్వర్యంలో చేరుకున్నారు.
వంద సీట్లు గెలుస్తాం
బేగంపేట: త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రాష్టవ్య్రాప్తంగా వంద సీట్లు గెలిచి, మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని సనత్‌నగర్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అపద్దర్మ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆశాభావం వ్యక్త చేశారు. సోమవారం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఊరేగింపుగా వెళ్లి అమీర్‌పేట మండల ఆఫీసులో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గం ప్రజల రుణం మర్చిపోలేనని, ఎప్పటికీ వెన్నంటి ఉంటున్నారని, అండగా ఉంటానని వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శేషుకుమారి, అరుణ గౌడ్, తరుణి, లక్ష్మీ బాల్‌రెడ్డి, ఆకుల రూప, హేమలత, మాజీ కార్పొరేటర్లు మహేశ్వరి, అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్, టీఆర్‌ఎస్ నేతలు తలసాని సాయి, శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, నాగేందర్, హరికృష్ణ, శ్రీహరి, శంకర్ యాదవ్ పాల్గొన్నారు.
అభివృద్ధిలో నెంబర్ వన్‌గా చేస్తా
* టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్‌గౌడ్
సనత్‌నగర్ ప్రజలు తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని సనత్‌నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్‌గౌడ్ అన్నారు. సనత్‌నగర్ నుంచి అమీర్‌పేట వరకు భారీ ర్యాలీలో వెళ్లి అమీర్‌పేటలో ఆర్‌ఓకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నియోజకవర్గం ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని, నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించారు. చాలాకాలంగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని వివరించారు.కార్యక్రమంలో టీడీపీ నేతలు శ్రీపతి సతీష్, గంగాధర్ గౌడ్, శ్రావణ్ గౌడ్, రాజు, దుర్గయ్య, కృష్ణపూజారి, నవీన్ యాదవ్, రాంకుమార్ పాల్గొన్నారు.
కుషాయిగూడ: ఉప్పల్ నియోజకవర్గం మహాకుటమి ఆభ్యర్థి తూళ్ల వీరేందర్ గౌడ్ విజయం ఖాయమని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాప్రా సైనిక్‌పురి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు ఆర్పించి ర్యాలీని వీరేందర్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ర్యాలీ ఏఎస్‌రావునగర్, ఈసీఐయల్, మీర్‌పేట్ హెచ్‌బీకాలనీ మీదుగా మల్లాపూర్, నాచారం చౌరస్తాకు చేరుకుంది.
వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నివాళి అర్పించి ఉప్పల్‌కు బయలుదేరారు. ర్యాలీలో మహాకుటమి నాయకులు లక్ష్మారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బోస్, జానీ, టీడీపీ నాయకులు టీజీకే ముర్తి, రాములు యాదవ్, సాంబముర్తి గౌడ్, సతీష్, రహీమ్, శరత్ చంద్ర పాల్గొన్నారు. ఉప్పల్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా కుషాయిగూడకు చెందిన సోమశేఖర్ రెడ్డి కుషాయిగూడ, ఈసీఐఎల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దఖాలు చేశారు. ర్యాలీలో సీతారాంరెడ్డి, మల్లయ్యగారి విష్ణువర్ధన్ రెడ్డి, వీరేశం, నరేష్, శ్రీకాంత్ రెడ్డి, బబ్బి, గోపాల్ యాదవ్, లింగస్వామి, శ్యాంసన్, మెహన్ పాల్గొన్నారు.
కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి
ఘట్‌కేసర్: ప్రజా సంక్షేమాన్ని మరిచి కుటుంబ క్షేమం కొరకు పని చేసే కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని మేడ్చల్ బీజేపీ అభ్యర్ధి కొంపల్లి మోహన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ జరిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్డిన ఆర్ధిక, సంక్షేమ పథకాలే తమను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానుందని, మోదీ పాలనను అందిస్తామని చెప్పారు. మండల బీజేపీ అధ్యక్షుడు కంభం లక్ష్మారెడ్డి, బాల్‌రాజు, రామోజీ, అచ్చిని రమేశ్, ఎదుగని శ్రీరాములు పాల్గొన్నారు.
పది వేల మందితో సబితా ఇంద్రారెడ్డి ర్యాలీ
బాలాపూర్: మహేశ్వరం అసెంబ్లీ ప్రజా కూటమి అభ్యర్థిగా పీ.సబితా ఇంద్రారెడ్డి భారీ ఎత్తున మద్దతు దారులతో కలిసి నామినేషన్‌కు ర్యాలీగా తరలివెళ్లారు. సోమవారం ఉదయం 11 గంటలకు కర్మాన్‌ఘట్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంద మల్లమ్మ చౌరస్తా నుంచి దాదాపు పది వేల మందితో కలిసి భారీ ర్యాలీగా తరలివెళ్లారు. కాంగ్రెస్, టీడీపీతో పాటు ప్రజా కూటమిలో గల పలు పార్టీల కార్యక్తలు వేలాది ద్విచక్ర, వాహనాలు, వందలాది కార్లు, ఓపెన్ టాప్ జీపులలో జెండాలు ధరించి పెద్ద ఎత్తున నినదాలు చేస్తూ.. ర్యాలీగా తరలివెళ్లారు.
కార్యక్రమంలో సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి, సరూర్‌నగర్ ఎంపీపీ తీగల విక్రం రెడ్డి, బడంగ్‌పేట్ మున్సిపాలిటీ ఇన్‌చార్జి చైర్మన్ చిగురింత నర్సింహా రెడ్డి, ప్లోర్ లీడర్ యాతం శ్రీశైలం యాదవ్, బడంగ్‌పేట్ మున్సిపాలిటి అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సూర్ణగంటి అర్జున్, టీపీసీసీ కార్యదర్శి మాజీ జేడ్పీటీసీ చల్లా నర్సింహా రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వంగేటి ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామిడి రాంరెడ్డి, సామ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు భీమిడి స్వప్న జంగారెడ్డి, మమత సుదర్శన్ రెడ్డి, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, గుర్రం ప్రసన్న వెంకట్ రెడ్డి, ఇంద్రపల్లి యాదగిరి, గౌవర శారద సత్యనారాయణ, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య బీరప్పా, బీ బ్లాక్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బండి మీనా నాగేష్ యాదవ్, పల్లె జంగయ్య గౌడ్, బండి నాగేష్ యాదవ్, మీర్‌పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సామిడి గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అర్కల కామేష్ రెడ్డి పాల్గొన్నారు.
17 మంది నామినేషన్లు
మెహిదీపట్నం: కార్వాన్ నియోజకవర్గంలో మొత్తం 17 మంది నామినేషన్లును వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు ఇండిపెండింట్ అభ్యర్థులు వేశారని రీటర్నింగ్ అధికారిని సూర్యలత తెలిపారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌సింగ్ నాలుగు సెట్లు, బీజేపీ అభ్యర్థి అమర్‌సింగ్ మూడు సెట్లు, ఎంఐఎంకి చెందిన కౌసర్ మొహినుద్దిన్ మూడు సెట్లు, మహాకూటమి అభ్యర్థి ఉస్మాన్ రెండు, ఇండిపెండెంట్ అభ్యర్థి రమేష్ రెండు సెట్లను నామినేషన్లు వేసినట్లు తెలిపారు. మొత్తం 31 నామినేషన్లు వచ్చాయని రిటర్నింగ్ అధికారిణి సూర్యలత పేర్కొన్నారు.