రంగారెడ్డి

శివాలయాల్లో కార్తీక దీపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, నవంబర్ 19: శివనామస్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా శివాలయాలకు చేరుకొని అభిషేకాలు చేయడంతోపాటు కార్తీక దీపం వెలిగించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల పరిధిలో ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోయాయి. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామ శివారులో ఉన్న శ్రీఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు తెల్లవారుఝాము నుంచి బారులు తీరారు. దేవాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేందుకు భక్తులు కుటుంబ సమేతంగా చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజ స్తంభం వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు.
ఈ-కామర్స్‌పై బిజినెస్ కాన్‌క్లేవ్
జీడిమెట్ల, నవంబర్ 19: నగర శివారు ప్రాంతంలోని బాచుపల్లి విజ్ఞాన్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఈ-కామర్స్‌లో ప్రస్తుత పోకడల గురించి, భవిష్యత్తులో అవకాశాల గురించి బిజినెస్ కాన్‌క్లేవ్‌ను నిర్వహించింది. ఈ-కామర్స్ వచ్చిన తర్వాత వ్యాపార సరళిలో తీసుకువచ్చిన పెను మార్పులు, చరవాణి, ఇంటర్నెట్లతో లావాదేవీల నిర్వహణ, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి సౌకర్యాలతో సమూలంగా వ్యాపార రంగానే్న మార్చేసిన తీరుని నిపుణులు వివరించారు. ఏదో ఒక స్థాయిలో అంతర్జాలాన్ని వాడకుండా నేటి వ్యాపారాలేవీ నడిచే అవకాశమే లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ-కామర్స్‌లో వ్యాపారాలను బీ2సీ, బీ2బీ, సీ2బీ, సీ2సీగా విభజించవచ్చని, ఇవేకాకుండా నేటి సమాజంలో వచ్చిన మార్పులతో గవర్నమెంట్ టు బిజినెస్ (జీ2బీ), బిజినెస్ టు గవర్నమెంట్ (బీ2జీ), గవర్నమెంట్ టు కన్జ్యూమర్ (జీ2సీ) ఇప్పుడు ఈ-కామర్స్‌తో లాభపడుతున్నాయని వక్తలు చెప్పారు. నాగరికత జీవన శైలీ, తలసరి ఆదాయంలో పెరుగుదల వంటి ఆధునికతతో దేశంలో ఈ-కామర్స్ వేగంగా విస్తరిస్తోందని, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలతో రెండవ, మూడవ శ్రేణి నగరాల్లోకి కూడా వ్యాపారాలు చొచ్చుకుని వెళ్లగలుగుతున్నారని, ఈ నేపథ్యంలో చరవాణి కోసం యాప్‌ల తయారీ పలు ఉద్యోగాలను సృష్టించిందని అభిప్రాయపడ్డారు. అవంతీస్ టెక్నాలజీస్ ముఖ్య కార్య నిర్వహణాధికారి వినయ్ పెద్ది, లెట్జ్ బ్యాంక్.కామ్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్య నిర్వహణాధికారి యెమెనీ టాగోర్‌జీ, గ్రీన్స్ అండ్ మోర్ సంస్థ వ్యవస్థాపకురాలు, ముఖ్య కార్య నిర్వహణాధికారిణి ప్రీతి సిన్హా, కమ్యూట్ సహ వ్యవస్థాపకుడు హేమంత్ జొన్నల గడ్డ, నౌకరీ.కామ్ సీనియర్ జోనల్ మేనేజర్ జీవీ వంశీకృష్ణ, మీ-సేవా కన్సల్టెంట్లు సాకేత్ శివ, గౌరవ్ జైన్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో కళాశాల సంచాలకులు డాక్టర్ సీహెచ్‌ఎస్ దుర్గాప్రసాద్, విజ్ఞాన్ జ్యోతి సంస్థ ప్రధాన కార్యదర్శి కే.హరిశ్చంద్ర ప్రసాద్, ముఖ్య కార్య నిర్వహణాధికారి ఆచార్య వీఎస్‌ఎస్ కుమార్ పాల్గొన్నారు.