రంగారెడ్డి

ఎన్నికలు ముగిసినా తగ్గని వేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 8: ఎన్నికల సమరం ముగిసింది. హోరాహోరి పోరు తీరు కాస్త ఓట్ల రూపంలో ఈవీయంలో పదిలమయ్యాయి. దీంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రధాన పార్టీలన్నీ గెలుపు ఓటములపై బేరీజు వేసుకుంటున్నాయి. ఎవరికి వారే విజయాలపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 11వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు దిశగా అందరూ తమ దృష్టిని మళ్లిస్తున్నారు. శుక్రవారం ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఏ ఇద్దరు గుమడిగూడినా, ఏ నేత చెంతన చేరినా అందరిలోనూ ఎవరు గెలుస్తారనే చర్చనే విపరీతంగా జరుగుతుంది. ఏ వర్గం ఓట్లు అనుకూలంగా మారే వీలుందనే అంచనాల్లో అందరూ మునిగిపోతున్నారు. నియోజకవర్గంలో పోలైన ఓట్లల తమకు ఎంత మేర లభించే వీలుందనే లెక్కల్ని కట్టి గెలుపై ధీమాను సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారు.
కొంత మేర తగ్గిన ఓట్ల శాతం
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందనే చెప్పవచ్చు. గత 2014 ఎన్నికల్లో 59.40 శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,40,867 ఉండగా, 2,50,493 మంది ఓటు వేసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం సుమారు 56.09 గా నమోదైంది. అంటే సుమారు 3.31 శాతం మేర ఓటింగ్ తగ్గింది.
గెలుపోటములపై బెట్టింగులు
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నికలు పూర్తవ్వడంతో బెట్టింగులు ఊపందుకున్నాయి. నియోజకవర్గంలో సుమారు ఐదు ప్రధాన పార్టీలు తలపడ్డాయి. టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకాష్‌గౌడ్, మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థి గణేష్‌గుప్త, బీజేపీ నుంచి బద్ధం బాల్‌రెడ్డి, ఎంఐఎం నుంచి మీర్జా రెహ్మత్‌బేగ్, స్వతంత్ర అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డిల మధ్య ఎన్నిక రసవత్తరంగా కొనసాగింది. దీంతో స్థానికంగా టీఆర్‌ఎస్, బీజేపీ, మహాకూటమి, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందుతారని పలువురు బెట్టింగులు వేసుకుంటున్నారు. లక్షల రూపాయలు బెట్టింగుల్లో చేతులు మారడం నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా చెప్పుకోవచ్చని పలువురు నాయకులు తెలుపుతున్నారు.
టీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్యే హోరాహోరి పోరు
రాష్ట్రంలో ఉన్న ఇతర నియోజకవర్గాలకు, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చాలా తారతమ్యం ఉందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఎంఐఎం, టీఆర్‌ఎస్ మిత్రపక్షాలని ప్రకటించుకున్నప్పటికీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్ మహాశయుడు ఎవరిని గద్దెనెక్కిస్తాడో వేచి చూడాల్సిందే.
చేపట్టిన అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారు
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో తాము చేపట్టిన అబివృద్ధి పనులే తమను అధికారంలోకి తిరిగి తీసుకువస్తాయని టి.ప్రకాష్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు తనపై ఉన్న నమ్మకం, గౌరవంతో ఓటు గెలిపిస్తారని చెప్పుకొచ్చారు.
అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ను గెలిపించడమే అనివార్యమన్నారు.
ఎంఐఎం చేసిన అభివృద్ధే
తనను గెలిపిస్తుంది
ఎంఐఎం చేసిన అభివృద్ధితోనే తనను రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమీ లేదని దుయ్యబట్టారు.
ఈ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రత్యర్థి అని తెలిపారు.
రాజేంద్రనగర్‌లో సెటిలర్ల ఓట్లు తమకే..
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపొటములు సెటిలర్ల ఓట్లపై ఆధారపడి ఉంటుందని, ఈ ఎన్నికల్లో సెటిలర్లు తమనే గెలిపించనున్నారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలు తమను ఎన్నుకోవడం ఖాయం.

ఎవరి ధీమా వారిదే
*మంచిరెడ్డి, మల్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 8: అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ పర్వం ముగిసింది. దీంతో నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. ఈనెల 11న జరిగే ఓట్ల లెక్కింపుతో ఎన్నికల బరిలో ఎవరు గెలుస్తారో తేలిపోనుంది. నెల రోజులుగా ప్రచారహోరుతో గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేపట్టిన నేతల భవిష్యత్తు రెండు రోజుల్లో తెలియనున్నది. ఇబ్రహీంపట్నంలో ప్రధానంగా ఐదుగురు అభ్యర్థుల మధ్య పోటీ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రజాకూటమి మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సామ రంగారెడ్డి, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొత్త అశోక్ గౌడ్, బీఎల్‌ఎఫ్ బలపరిచిన కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పగడాల యాదయ్య మధ్యే పోటీ ఉంది. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్యనే హోరాహోరీ పోరుజరిగినట్లు రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు.
పరిస్థితులు కూడా దీనికి బలం చేకూర్చుతున్నాయి. కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటగా తెలుగుదేశం అభ్యర్థి సామ రంగారెడ్డికి మద్దతిస్తున్నట్లు ప్రకటించినా ఎన్నికల పోలింగ్‌కు ఒక్కరోజు ముందు మల్‌రెడ్డికి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉండడంతో ఓటర్లు చాలా మంది బీఎస్పీ అభ్యర్థివైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఎన్నికలు హోరాహోరీగానే జరిగాయ. ఫలితాలు వెలువడే చివరి నిమిషం వరకు ఎవరు గెలుస్తారనే విషయం చెప్పలేమని రాజకీయ పండి