రంగారెడ్డి

పట్నంలో మరోమారు గెలిచేది టీఆర్‌ఎస్సే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, డిసెంబర్ 8: ఇబ్రహీంపట్నం శాసనసభకు మరోమారు గెలిచేది తామేనని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం మాట్లాడుతూ పోలింగ్ సరళి సజావుగా జరిగేందుకు ప్రతిఒక్కరు సహకరించారని అన్నారు. నియోజకవర్గంలో నమోదైన 76 శాతం పోలింగ్‌ను పరిశీలించి చూస్తే తామె ముందంజలో ఉండి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు పన్నిన కుట్రలు, పారించిన డబ్బు ప్రవాహానికి, అమలుకాని హామీలకు, ప్రగల్భాలకు స్థానిక ఓటర్లు లొంగలేదని తెలిపారు. మరోమారు అభివృద్ధికే పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా పార్టీ కోసం, తన గెలుపుకోసం పనిచేసిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
షాద్‌నగర్‌లో 87.68 శాతం ఓటింగ్
ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.కృష్ణ
షాద్‌నగర్, డిసెంబర్ 8: శాసనసభ ఎన్నికల్లో 87.68శాతం ఓటింగ్ నమోదు అయినట్లు షాద్‌నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.కృష్ణ తెలిపారు. శనివారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాలతోపాటు షాద్‌నగర్ పురపాలక సంఘంలో 185024ఓటర్లు ఉండగా 165767మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వివరించారు.

ఎన్నికలలో మహిళా ఓటర్లే అధికం
కొడంగల్, డిసెంబర్ 8: శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 81.44 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని 264 పోలింగ్ స్టేషన్‌ల్లో 164372 ఓటర్ల ఓటును నమోదు చేసుకున్నారు. అందులో పురుషులు 81983, మహిళలు 82389 ఓటు హక్కును నమోదు చేసుకోగా అందులో 406 మంది మహిళ ఓటర్లే అధిక్యంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఎన్నికలలో దాదాపు 70 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ సారి ఎన్నికలలో 11 శాతం పోలింగ్ అధికంగా నమోదు కావడం జరిగింది. ఎన్నికల తీర్పు ఏ విధంగా ఉంటుందో నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య గట్టీ పోటీ ఉండటంతో కొంత మంది కాంగ్రెస్ గెలుస్తుందని, మరి కొంత మంది టీఆర్‌ఎస్ అత్యధిక మేజారీటితో గెలుస్తుందని బెట్టింగ్‌లు కోట్ల రూపాయల దూబార ఖర్చులకు తెరలేపుతున్నారు.
దీనిపై ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో వేచి చూడాల్సి ఉంది.