రంగారెడ్డి

మేడ్చల్ కిరీటం ఎవరిదో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, డిసెంబర్ 8: మేడ్చల్ నియోజకవర్గంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి, ప్రజా కూటిమి (కాంగ్రెస్) అభ్యర్థిగా కేఎల్‌ఆర్, బీజేపీ అభ్యర్థిగా పెద్ది మోహన్ రెడ్డి, బీఎస్‌పీ (టీఆర్‌ఎస్ రెబల్) అభ్యర్థిగా నక్క ప్రభాకర్ గౌడ్ పోటీపడ్డారు. బీజేపీ అధిష్టానం అందరికంటే ముందు తమ అభ్యర్థిగా మోహన్ రెడ్డిని ప్రకటించింది. అప్పటి నుంచే ఎన్నికలు ముగిసే దాకా ప్రచారంలో అందరికంటే ముందంజలో నిలిచారని చెప్పవచ్చు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించలేదు. ఎన్నికల 20 రోజుల ముందు ఎన్నో అనూహ్య పరిస్థితుల మధ్య చిట్టచివరికి మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డికి మేడ్చల్ టికెట్ కేటాయిస్తున్నట్లు టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రకటించింది. అప్పటి నుండి మల్లారెడ్డి అలుపెరుగకుండా నియోజకవ్గరంలో ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించి తనదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చాలా కసరత్తు చేశారు. మహా కూటమి (కాంగ్రెస్) అభ్యర్థిగా కేఎల్‌ఆర్‌ను ప్రకటించింది. అంతలోనే మేడ్చల్‌లోనే సోనియా, రాహుల్‌గాంధీల బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో కేఎల్‌ఆర్ ఇతర అభ్యర్థులకన్న ప్రచారంలో కాస్త వెనుకబడ్డారని చెప్పవచ్చు. బీఎస్‌పీ అభ్యర్థి నక్క ప్రభాకర్ గౌడ్ ఇతర అభ్యర్థులకన్న భిన్నంగా ప్రచారం నిర్వహించి అన్ని వర్గాల వారిని తన వైపు తిప్పుకునేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేసి అందులో సఫలం కూడా అయ్యారని భావించవచ్చు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు నువ్వా నేనా అన్న రీతిలో అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహించి ఓటర్లను అకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అదేవిధంగా బీఎస్‌పీ అభ్యర్థి ప్రభాకర్ గౌడ్ ఏకంగా బీఎస్‌పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతితో మేడ్చల్‌లో బహిరంగ సభ నిర్వహించి తన సత్తా ఎంటో ప్రత్యర్థులకు చూపించారు. తొలుత అందరూ చతుర్మఖ పోటీ తప్పదని భావించిన ఎన్నికల తేదీ సమీపించిన కొద్ది రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని విశే్లషకులు భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మాత్రం అందిరికీ భిన్నంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని డంపింగ్‌యార్డు ఎత్తివేత విషయమై తాను చాలా పోరాటం చేశానని ఆ అంశం కూడా తనకు కలుస్తోందని తన విజయం తథ్యమని ధీమాగా ఉన్నారు. మరికొందరేమో మల్లారెడ్డి గెలుపు తథ్యమని కాకపోతే మోజారిటీ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
దాంతో వీరి మధ్య ప్రజా కూటమి అభ్యర్థి కేఎల్‌ఆర్ గెలిచే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు. ఎది ఎమైనా అధికారికంగా ఎవరు గెలుస్తారనేది మాత్రం 11వ తేదీన తెలిపోతుంది. అప్పటి దాకా విశే్లషణలు చర్చలు చేసుకోవడం తప్ప చేసేది ఏమి లేదని కొందరు అంటున్నారు.
అభ్యర్థులు మాత్రం ఆయా ప్రాంతాల్లో నమోథైన ఓటింగ్ శాతాన్ని బట్టి కూడికలు తీసివేతల్లో తలమునకలయ్యారు. 11వ తేదీన ఎవరి భవితవ్యం ఎంటనేది తేలిపోనుంది.
అభ్యర్థుల జాతకాలు ఈవీఎమ్‌లో భద్రం
ఆమనగల్లు, డిసెంబర్ 8: ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఘట్టం ముగియడంతో అభ్యర్థుల జాతకాలు ఈవీఎమ్‌లో భద్రంగా ఉన్నాయి. కౌంటింగ్‌కి ఇంకా మూడు రోజులు గడువు ఉండడంతో అభ్యర్థులు ఆయా పార్టీల నాయకులు జోరుగా చర్చించు కుంటున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా త్రిముఖ పోటీ ఉంటుందని భావించిన రాజకీయ విశే్లషకుల అంచనాలను ఓటర్లుతారు మారు చేశారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్యనే ప్రదానంగా నువ్వా నేనా అనే రీతీలో ఓటింగ్ జరిగిందని ఓటర్లు చర్చిచుకుంటున్నారు. నియోజకవర్గంలో దాదాపు ఏడు మండలలో 84.5శాతం పోలింగ్ నమోదు, 1లక్ష 71000 ఓట్లు పోలు అయినట్లు కల్వకుర్తి రిటర్నింగ్ అధికారి రాజేశ్ కుమార్ తెలిపారు.