రంగారెడ్డి

ఓటమి భయంతోనే చిల్లర రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, డిసెంబర్ 8: కల్వకుర్తి నియోజకవర్గంలో పేదల బిడ్డగా ఉద్యమాల ముద్దు బిడ్డగా పేరొందిన తనకు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో గెలుపు దిశగా పయనిసుండగా తనపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి ఓటమి భయం పట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తూన్నాడని బీజేపీ అభ్యర్థి తల్లోజీ ఆచారి ఆరోపించారు. శనివారం ఆమనగల్లులో విలేఖరులతొ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా శుక్రవారం ఉదయం 10గంటల వరకు జరిగిన 30శాతం పోలింగ్‌తో కాంగ్రెస్‌కు ఆదరణ లేనట్టు గుర్తించిన ఆయన జంగరెడ్డి పల్లి గ్రామంలో ఓ గిరిజన మహిళతో అనుచితంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురైన్నట్టు తన దృష్టికి వచ్చినట్టు పేర్కొన్నారు.
కల్వకుర్తిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే ఓటమి భయంతోనే ప్రజల నుంచి సానుభూతి పొంది ఓట్లు పొందవచ్చుననే నమ్మకంతో ఇలాంటి డ్రామాలకు తెర లేపాడని అన్నారు. గిరిజన మహిళ పై అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహించి నిలదీసారే తప్ప ఓటమికి గురైవుతానన్న బాధతో మీడియాకు తప్పుడు సమాచారం అందించినట్లు ఆరోపించారు. రెండు నెలలుగా బీజేపీ అభ్యర్థిగా ప్రజలు తనను ఆదరిస్తుండడంతో కుయుక్తులు ఎత్తుగడలు సాధించిన కల్వకుర్తి ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని అన్నారు నియోజకవర్గంలో వంశీచంద్ రెడ్డి పనితీరు నచ్చక ప్రజలు తనను ఆదరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు జిమ్మిక్కులు కటీల ప్రచారాలను ప్రజలు విశ్వసించకుండ నియోజక వర్గం మెత్తంలో తనకు సంపూర్ణ మద్దతు ఇచ్చి అఖండ మెజారిటితో గెలిపిస్తున్నారని ఆచారి ధీమా వ్యక్తం చేశారు.

ఎల్బీనగర్‌లో టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయం
* ఎల్బీనగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ గౌడ్
వనస్థలిపురం, డిసెంబర్ 8: ఎల్బీనగర్‌లో గులాబి జెండ ఎగిరి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండవ సారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఎల్బీనగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం వైదేహి నగర్‌లోని తననివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత రెండునెలలుగా ఎల్బీనగర్‌లోని అన్ని ప్రాంతాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికీ అన్ని విధాల సహకరించిన 11 డివిజన్‌ల కార్పొరేటర్లకు, డివిజన్ అధ్యక్షులకు, పార్టీ సీనియర్ నాయకులకు, అభిమానులకు మహిళ నాయకురాళ్లకు, కృతజ్ఞతలు చెప్పారు. ఎల్బీనగర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఎన్నికల సరళీని గమనిస్తుంటే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పట్ల ప్రజలకు పూర్తిగా నమ్మకం కలిగిందని గుర్తు చేశారు. మరోసారీ అధికారం చేపట్టనున్న కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం పూర్తి స్థాయిలో నెర వేరుతుందని రామ్మోహన్ గౌడ్ చెప్పారు.