రంగారెడ్డి

ఓటరు నాడి కనిపెట్టని పార్టీల అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 9: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఉత్కంఠ మిగిల్చారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తంగా ఉండటంతో గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల నాడి కనిపెట్టడంలో పార్టీల అభ్యర్థులు వెనకడుగు వేశారని చెప్పవచ్చు. షాద్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల విజయంపై స్థానికంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్- 11వ తేది ఎప్పుడు వస్తుందా..అని పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో 90శాతం, నందిగామ మండలంలో 90శాతం, కేశంపేట మండలంలో 89శాతం, కొందుర్గు మండలంలో 87శాతం, జిల్లేడు చౌదరిగూడ మండలంలో 88.11శాతం, ఫరూఖ్‌నగర్ మండలంలో 80శాతం, షాద్‌నగ ర్ పురపాలక సంఘంలో 80శాతం పోలింగ్ అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 87.68శాతం పోలింగ్ నమోదు అయినట్లు స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.కృష్ణ తెలిపారు. 2014సార్వత్రిక ఎన్నికల్లో 80.26శాతం పోలింగ్ అయినప్పటికి 2018ఎన్నికల్లో మాత్రం ఏడుశాతం పోలింగ్ పెరిగినట్లు అధికారులు వివరించారు. ఓటర్లలో చైతన్యం రావడం..ఎక్కువగా యువత ఉండటం వల్లే ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పవచ్చు. ఓటింగ్ శాతం పేరిగిన నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎల్గనమోని అంజయ్య యాదవ్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేయమే కాకుండా మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి విజయం సాధిస్తానని, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ సైతం విజయం సాధించేందుకు అన్ని అవకాశాలు తనకే ఉన్నాయని, బీజేపీ అభ్యర్థి నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి యువతలో చైతన్యం తెచ్చాం. విజయం సాధిస్తానంటూ ఇలా ఎవరికి వారే ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిసినప్పటి నుంచి రంగంలో ఉన్న అభ్యర్థులు ధీమా వ్యక్తం చేయడంతోపాటు వివిధ గ్రామాల్లో ఉన్న ముఖ్య కార్యకర్తలు, నేతలతో పోలింగ్ విషయంపై చర్చలు కొనసాగిస్తున్నారు. షాద్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై జోరుగా చర్చలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలందరి చూపు ఈవీఎంల పై ఉండటమే కాకుండా ఎప్పుడు ఓపెన్ చేస్తారంటూ ఎదురు చూస్తున్నారు. ఓటర్ల నాడిపై అంచన వేయడంలో రాజకీయ నేతలు కొంతమేరకు వెనుకంజ వేసినట్లు తెలుస్తొంది. అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠకు తెర పడాలంటే డిసెంబర్-11వ తేది వరకు వేచి చూడాల్సిందే.